గుజరాత్‌కు చెందిన ఇంజనీర్ అమిత్ గుప్తాను ఖతార్‌లో అరెస్టు చేసిన విషయం వెలుగుచూసింది. ఈ అరెస్టు క్రిమినల్ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అమిత్ గుప్తా టెక్ మహీంద్రా సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కాగా.. ఖతార్ పోలీసులు 2025 జనవరి 1న అమిత్ గుప్తాను అరెస్టు చేసినట్లు ఆయన తల్లి పుష్ప గుప్తా తెలిపారు. అయితే.. అమిత్ గుప్తాపై ఉన్న అభియోగాలు, అతన్ని ఏ నేరానికి అరెస్టు చేశారన్నది తెలియలేదు. ఈ విషయం పై గుప్తా కుటుంబం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ.. గోప్యతతో కూడిన విచారణ జరిపించి తమకు సహాయం అందించాలని కోరింది. గుప్తాను అన్యాయంగా అరెస్టు చేసినట్లు అతని కుటుంబం చెబుతోంది.
Read Also: Aamir Khan : ఆమె వల్ల నరకం అనుభవించా.. అమీర్ ఖాన్ ఎమోషనల్..
అమిత్ గుప్తా నిర్దోషి.. డేటా దొంగతనం కేసులో అమిత్ గుప్తాను ఇరికించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. అమిత్ గుప్తా తల్లి పుష్ప గుప్తా ఖతార్ వెళ్లి భారత రాయబార కార్యాలయంతో సంప్రదించింది. ఈ క్రమంలో భారత రాయబార కార్యాలయం అమిత్‌కు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అమిత్ గుప్తా గత 10 సంవత్సరాలుగా ఖతార్‌లోని టెక్ మహీంద్రా సంస్థలో పనిచేస్తున్నాడు. మరోవైపు.. గుప్తాను కలవడానికి తన తండ్రి ఖతార్ వెళ్లారు. అయితే అతనిని కలవడం సాధ్యం కాలేదు.
Read Also: SYG : శ్రీకాంత్ పవర్‌ఫుల్ లుక్ రిలీజ్..
ఖతార్‌లో భారతీయులను అరెస్టు చేయడం ఇది మొదటిసారి కాదు. 2022లో ఎనిమిది మంది భారత నావికులను అరెస్టు చేశారు. వారికి మరణశిక్ష విధించిన అక్కడి ప్రభుత్వం.. ఆ తరువాత ఎమిర్ ఆదేశాల మేరకు కోర్టు వారిని విడుదల చేసింది. కాగా.. అమిత్ గుప్తా కుటుంబం.. ప్రభుత్వాన్ని, ఖతార్ అథారిటీస్ నుండి తగిన సహాయం అందించాలని కోరుకుంటోంది.