మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
పాకిస్తాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్.. తన అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ బంతితో ఆమె ప్రాక్టీస్ షాట్లు చూస్తే.. క్రికెట్ అభిమానులు బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలి గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఒక ఆసక్తికరమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ దూకుడు విధానాన్ని విరాట్ కోహ్లీ అవలంబించకూడదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా.. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాతో కలిసి దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకుముందు ప్రధాని మోదీని ప్రశంసించిన వ్యాఖ్యలు, ఈ ఫోటో శశి థరూర్ రాజకీయ భవిష్యత్తును మరింత ఉత్కంఠకరంగా మార్చాయి.
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది.
ఆర్సీబీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ఈసారి అట్టడుగున నిలుస్తుందని జోస్యం చెప్పారు. ఆర్సీబీ అంటే తనకేమీ ద్వేషం లేదని.. కోహ్లీకి కూడా తానెప్పుడూ వ్యతిరేకం కాదన్నారు.
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గైర్హాజరవనున్నట్లు సమాచారం. భార్య అతియా శెట్టి తొలి బిడ్డకు జన్మనివ్వనుండటంతో ఆయన జట్టును వీడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ జట్టులో ఆటగాడైన మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఈ విషయాన్ని తెలిపింది.