ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు.
శనివారం గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (జిఎస్‌ఎల్) ప్రాజెక్ట్ 1135.6 కింద రెండవ ఫాలో-ఆన్ యుద్ధనౌక "తవస్య"ను ప్రారంభించింది. ఈ యుద్ధనౌక ప్రారంభం.. భారతదేశం నావికాదళ స్వావలంబన వైపు ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు. ఈ ప్రక్రియలో తపస్య కీలక పాత్ర పోషిస్తోంది.
హర్యానాలోని బహదూర్‌గఢ్‌లో శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనను పరిశీలించిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ విచారించనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలకు ఈడెన్ గార్డెన్స్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, గాయని శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా, నటి దిశా పటానీలతో కలిసి ఈడెన్ గార్డెన్స్ సిటీ వేదిక కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్రారంభ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సాయంత్రం 7.30 గం.కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడనున్నాయి.
రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టిక్కట్లను విచ్చలవిడిగా బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం.. అతని వద్ద నుంచి టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.