వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
మనం పీల్చే గాలి రోజురోజుకూ భయంకరంగా మారుతోంది. పొగమంచు మరియు గాలి నాణ్యత స్థాయిలు తగ్గిపోవడం ఇప్పుడు కాలానుగుణంగా మనం ప్రతి సంవత్సరం పోరాడుతున్న సమస్యగా మారినప్పటికీ, AQI స్థాయిలు ఈసారి చాలా భయంకరంగా ఉన్నాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో AQI 600 కంటే ఎక్కువగా ఉంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. PM స్థాయి 700 కంటే ఎక్కువ ఉన్న ప్రదేశాలకు వెళ్లవద్దు అని సూచిస్తున్నారు. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో నివసిస్తుంటే ఇంటినుంచి బయటకు రావద్దని చెబుతున్నారు. అయితే ప్రజలు పని కోసం…
ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి.
జట్టు పరాజయాలపై కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించారు. ఈ టోర్నీలో తాను ఫామ్ కోల్పోవడం జట్టుకు చేటుచేసిందని అన్నాడు. ఈ టోర్నీలో బట్లర్ ఒక్క మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ చేయలేదు. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచుల్లో ఇంగ్లండ్ రెండుసార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించింది. ఈ వరల్డ్ కప్ లో బాగా ఆడి.. టైటిల్ సాధించాలని అనుకున్నామని, తాను ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే జట్టు ఓటమిలకు దారి తీసిందన్నాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో సూట్‌కేస్‌లో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సరస్సులో చెత్తను తొలగిస్తుండగా పారిశుద్ధ కార్మికులకు కంటపడింది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. మంగళవారం ఉదయం ఓక్లాండ్‌లోని సరస్సును శుభ్రం చేస్తుండగా పారిశుద్ధ్య కార్మికులకు నీటిపై తేలుతూ సూట్‌కేస్ కనిపించింది.
BEML రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌లోని ఎగ్జిక్యూటివ్‌తో సహా ఇతర పోస్టులపై రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభంకానుంది. అయితే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక సైట్ bemlindia.in ను సందర్శించి రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది.
ప్రపంచ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పాక్.. డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో వర్షం రెండుసార్లు రావడంతో అంఫైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటిసారి వర్షం పడినప్పుడు ఓవర్లను 41కి కుదించగా, లక్ష్యాన్ని కూడా 342కు తగ్గించారు. ఈ క్రమంలో మరోసారి వర్షం పడుతుండటంతో పాకిస్తాన్ విజేతగా ప్రకటించారు.