ఈ దీపావళికి SBI, PNB సహా కొన్ని బ్యాంకులు కస్టమర్లకు గృహ రుణాలపై ఆఫరు ప్రకటించాయి. ధంతేరాస్, దీపావళి సందర్భంగా జనాలు ఇళ్లు, కార్లు ఎక్కువగా కొంటుంటారు. ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించడానికి.. కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు గృహ రుణాలపై మంచి ఆఫర్లను ఇస్తున్నాయి. అందులో.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులన్నీ దీపావళి 2023లో గృహ రుణాలపై పండుగ ఆఫర్‌లను ప్రకటించాయి. అయితే ఆ ఆఫర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Jose Butler: ఈ వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన.. ఇంగ్లాండ్ కెప్టెన్ తీవ్ర ఆవేదన..!
SBI హోమ్ లోన్‌పై దీపావళి ఆఫర్‌లు
ధంతేరస్, దీపావళి సందర్భంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక పండుగ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఈ స్పెషల్ క్యాంపెయిన్ (SBI ఫెస్టివ్ హోమ్ లోన్ ఆఫర్స్) ద్వారా కస్టమర్లకు వడ్డీ రేట్లపై SBI భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. క్రెడిట్ స్కోర్ ప్రకారం కస్టమర్‌లు గరిష్టంగా 0.65 శాతం అంటే 65 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ గృహ రుణంపై దీపావళి ఆఫర్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తన కస్టమర్లకు (PNB ఫెస్టివ్ హోమ్ లోన్ ఆఫర్‌లు) గృహ రుణాలపై మంచి ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ ధంతేరాస్, దీపావళికి బ్యాంక్ నుండి హోమ్ లోన్ తీసుకుంటే.. బ్యాంక్ ప్రారంభ రేటుతో 8.40 శాతం గృహ రుణాన్ని అందిస్తోంది. అంతేకాకుండా.. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్‌పై బ్యాంక్ ఎలాంటి ఛార్జీని వసూలు చేయదు. హోమ్ లోన్ పొందడానికి PNB వెబ్‌సైట్ https://digihome.pnb.co.in/pnb/hl/ని సందర్శించవచ్చు. ఇదే కాకుండా.. టోల్ ఫ్రీ నంబర్ 1800 1800/1800 2021కి కాల్ చేయడం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి గృహ రుణంపై దీపావళి ఆఫర్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా దీపావళి సందర్భంగా ‘ఫీలింగ్ ఆఫ్ ఫెస్టివల్ విత్ బోబ్’ పేరుతో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు వర్తిస్తుంది. ఈ ఫెస్టివల్ ఆఫర్ ద్వారా.. గృహ రుణం 8.40 శాతం ప్రారంభ రేటుతో వినియోగదారులకు అందించబడుతుంది. అంతేకాకుండా.. బ్యాంక్ కస్టమర్ల నుండి జీరో ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది.