ఒడిశాలోని భద్రక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన 24 ఏళ్ల గర్భిణి మృతదేహం లభ్యమైంది. భండారిపోఖరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నపంగా గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే తన కూతురు హత్యపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత నెలరోజులుగా ఈ వార్ నడుస్తుంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పటివరకు 10 వేల మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులను ఉటంకిస్తూ అల్ జజీరా నివేదిక పేర్కొంది.
రేపు మిజోరంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇక్కడ అధికారంలోని ఎంఎన్ఎఫ్, ప్రతిపక్షంలోని జెడ్‌పీఎం, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉన్నది. అయితే, రెండు స్థానిక పార్టీల మధ్యే అసలైన పోటీ ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. అక్కడ పోటీ చేసే 174 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 114 మంది (66 శాతం) కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్ పేర్కొంది.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు.
కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కేఎస్ ప్రతిమ ఆదివారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని తన నివాసంలో దారుణంగా కత్తిపోట్లకు గురై, చనిపోయారు. అయితే ఈ హత్య కేసులో పోలీసులు కిరణ్ అనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు కొంతకాలంగా.. కర్ణాటక ప్రభుత్వంలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే అతన్ని కొన్ని రోజుల కిందట ప్రతిమ సర్వీసు నుంచి తొలగించింది.
అసెంబ్లీ పోలింగ్ కు ముందురోజు ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో బాంబు పేలుడు ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఒక బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలయ్యాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లపై గందరగోళం మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈడీ సమన్లకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ సమన్వయకర్త కేజ్రీవాల్‌ను ఈడీ ప్రశ్నించేందుకు సమన్లు పంపింది. నవంబర్ 2న ఈడీ ముందు హాజరుకావాలని తెలిపింది. అయితే సీఎం కేజ్రీవాల్ మాత్రం హాజరుకాలేదు.
నేపాల్లో 157 మందిని బలిగొన్న భూకంపం.. ఇప్పుడు ఢిల్లీని తాకింది. సాయంత్రం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంతో సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
శ్రీలంక-బంగ్లాదేశ్ మ్యాచ్ లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సమర విక్రమ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూస్.. టైం ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే ఔట్ అయ్యాడు. మాథ్యూస్ హెల్మెట్ క్లిప్ ఊడిపోవడంతో మరో హెల్మెట్ తెప్పించుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. అయితే అప్పటికే టైం అయిపోతుందని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అప్పీల్ చేశాడు. దీంతో టైమ్ ఔట్ కారణంగా బ్యాటింగ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే బంగ్లాదేశ్ తన అప్పీల్ ని వెనక్కి తీసుకుంటే మాథ్యూస్ బ్యాటింగ్ చేయొచ్చని అంపైర్లు చెప్పారు.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.