వరల్డ్ కప్ 2023లో ఇంగ్లాండ్ అత్యంత ఘోరమైన ప్రదర్శన చూపించింది. ఆడిన 7 మ్యాచ్ ల్లో కేవలం ఒక్క మ్యాచ్ లో గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్ పరువు పోగొట్టుకుంది. తాజాగా నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా ఆసీస్ చేతిలో పరాజయం పొందింది. దీంతో ఈ టోర్నీ నుంచి ఇంగ్లిష్ జట్టు నిష్క్రమించింది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో మంచి బ్యాటర్స్, బౌలర్స్ ఉన్నప్పటికీ ఓటమి బారీ నుంచి బయటపడలేదు.
Read Also: Bandi Sanjay: ఆ సంస్కృతి మా పార్టీలో లేదు.. కాంగ్రెస్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ఈ దారుణ పరాజయాలపై ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించారు. ఈ టోర్నీలో తాను ఫామ్ కోల్పోవడం జట్టుకు చేటుచేసిందని అన్నాడు. ఈ టోర్నీలో బట్లర్ ఒక్క మ్యాచ్‌లోనూ అర్ధ సెంచరీ చేయలేదు. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచుల్లో ఇంగ్లండ్ రెండుసార్లు మాత్రమే 200కుపైగా పరుగులు సాధించింది. ఈ వరల్డ్ కప్ లో బాగా ఆడి.. టైటిల్ సాధించాలని అనుకున్నామని, తాను ఆశించిన స్థాయిలో ఆడకపోవడమే జట్టు ఓటమిలకు దారి తీసిందన్నాడు. టోర్నీకి రాక ముందు ఎన్నెన్నో ఊహించుకున్నామని, కానీ ఈ పరిస్థితుల్లో తమ జట్టు చాలా బాధ పడుతుందని చెప్పుకొచ్చాడు.
Read Also: Maa Oori Polimera 2 : మా ఊరి పొలిమేర 2 రెండు రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..?
ఇదిలా ఉంటే.. ఇండియాలో తమ జట్టుకు భారత్ అభిమానులు చాలా ప్రోత్సాహించారని, కానీ తమ దేశం అభిమానుల ఆశలను దారుణంగా చిదిమేశామని బట్లర్ విచారం వ్యక్తం చేశాడు. తాను తిరిగి ఫామ్‌లోకి రావడం, మ్యాచ్‌లు గెలవడం కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. 2022లో టీ20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. అయితే తాజా టోర్నీలో ఫేవరెట్లుగా బరిలోకి దిగగా.. జట్టు బ్యాటింగ్ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ఫీల్డింగ్, బౌలింగ్ వారి వంతు కృషి చేశారన్నారు. ఇక.. ఇంగ్లండ్ తర్వాతి మ్యాచ్ పాకిస్థాన్‌తో ఆడనుంది.