విషపూరిత పొగమంచుతో దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత ఈరోజు కూడా తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం 9 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 437గా ఉందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకటించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో కాలుష్యాన్ని నివారించేందుకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.
మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు.
సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేయడంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. కల నెరవేరిందన్నాడు. భారత్ తరఫున ఆడే ప్రతి అవకాశం తనకు చాలా పెద్దదని తెలిపాడు. తన పుట్టినరోజున ప్రేక్షకుల ముందు ఈ రికార్డు నెలకొల్పడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించే అవకాశమిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు.
కోహ్లీ ఈ ఘనత సాధించడంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. విరాట్ పై అభినందనల వర్షం కురిపించాడు. బాగా ఆడావు అంటూ కితాబునిచ్చారు. ఈ రోజు విరాట్ బర్త్ డే విషయాన్ని ప్రస్తావిస్తూ చమత్కారంగా వ్యాఖ్యానించారు. "నేను 49 నుంచి 50 ఏళ్ల వయసుకు చేరుకునేందుకు 365 రోజులు పట్టింది... కానీ నువ్వు కొన్ని రోజుల్లోనే 49 నుంచి 50కి చేరుకోవాలని కోరుకుంటున్నాను... తద్వారా నా రికార్డు బద్దలు కొడతావని ఆశిస్తున్నాను" అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
తరచుగా రాత్రి భోజనంలో అన్నం, చపాతీలు ఎక్కువగా తింటుంటారు. అయితే తిన్న తర్వాత ఒక్కొసారి చపాతీలు మిగిలిపోతాయి. వాటిని దాచిపెట్టి ఉదయాన్నే తింటారు. రోటీలను పొద్దున్నే తినడం కొందరికి ఇష్టముండదు. దాంతో తినలేక పడేస్తారు. అయితే వాటిని పడేయకుండా.. చపాతీలతో స్పైసీ చాట్ చేసుకోవచ్చు. అలా రోటీలు వేస్ట్ అవవు, మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోయిద్ది. అంతేకాకుండా స్పైసీ చాట్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు చేసింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ (101) సెంచరీతో చెలరేగాడు. తన బర్త్ డే రోజు సెంచరీ సాధించడంతో అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రపంచ కప్లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ తన బర్త్ డే రోజున సెంచరీ చేసి.. తన ఫ్యాన్స్ కు గిఫ్ట్ ఇచ్చాడు. 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సెంచరీతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసి చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ కప్లో భాగంగా.. ఈరోజు భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టిక్కెట్ల అమ్మకాలు గోల్ మాల్ అయ్యాయి. టిక్కెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీకి నోటీసులు పంపించారు.
నేపాల్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం దాటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విపరీతమైన చలిలో వీధుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.