ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బలైపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కమీషన్లు, ఆగమాగం పనులు చేయడంతోనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ విభాగాన్ని, ఇంజనీరింగ్ అధికారులను పని చేసుకోనివ్వకుండా తానే ఇంజనీర్ అని కేసీఆర్ అహంభావం ప్రదర్శించినందుకు.. కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరి నీళ్ల పాలైందని ఆరోపించారు.
వన్డే ప్రపంచకప్-2023లో ఆఫ్గానిస్తాన్ మరో విక్టరీ సాధించింది. లక్నో వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 179 పరుగులు చేసింది. ఈ క్రమంలో 180 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాటర్లలో కెప్టెన్ షాహిదీ 56 నాటౌట్ పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రెహమత్ షా 52 పరుగులతో రాణించాడు.
ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా వన్డే వరల్డ్ కప్ను ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ ముగియగానే ఐపీఎల్ కోసం ఎదురుచూస్తారు. అయితే దానికోసం ఐపీఎల్ 2024 కోసం ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్లో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కాగా.. ఈనెల 26లోగా ఫ్రాంచైజీలు తాము విడుదల చేసిన, తమ వద్ద ఉంచుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించవల్సి ఉంటుంది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలొస్తే ప్రతిసారి గందరగోళం ఉంటుందన్నారు. ఇంకా మనలో పరిణితి, డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. ఏ దేశాల్లో ప్రజాస్వామ్య దేశాల్లో పరిణతి ఉందో ఆ దేశాలు ముందుకు పోతున్నాయని అన్నారు. ఓటు మనకు వజ్రాయుధం లాంటిది.. అదే మన తలరాతను మారుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరేం చేసారన్నది ఆలోచించి ఓటు వేస్తే మంచిదని చెప్పారు. ఎన్నికలొస్తాయి పోతాయి.. అభ్యర్థి గుణగణాలతో పాటు..…
కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులపై జానారెడ్డి స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి, బెదిరించడానికే ఈ దాడులని తెలిపారు.
సోమాజిగూడలోని కత్రియ హోటల్ లో నూతన మీడియా సెంటర్ను బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జి ప్రకాష్ జవడేకర్, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... సరిగ్గా ఒక్క నెల సమయం ఉంది.. ఇవాళ నామినేషన్ లు మొదలయ్యాయి... సరిగ్గా ఒక్క నెలలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర రూపు రేఖలు మారబోతోందని పేర్కొన్నారు.
ప్రపంచ కప్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. లక్నోలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్ జట్టు.. 179 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన చూపడంతో నెదర్లాండ్స్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసింది.
జహీరాబాద్ లో మంత్రి హరీష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్ పార్టీ గెలవాలని చూస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులేనని.. మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా ..?అని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ రైతుబంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ హిట్ వికెట్, కేసీఆర్…
ప్రపంచకప్‌లో భాగంగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 55 పరుగులకే లంక ఆలౌటైంది. ఈ మ్యాచ్లో షమీ, సిరాజ్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక బ్యాటర్లకు ఆసియా కప్ను మరోసారి గుర్తు చేశారు. ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ అభిమానులతో కెప్టెన్ రోహిత్‌శర్మ సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపాడు. అంతేకాదు.. ఓ యువకుడికి రోహిత్ శర్మ తన షూ ఇచ్చి ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం ముగిసింది. వైదిక నియమాలను అనుసరిస్తూ మూడు రోజులపాటు యాగాన్ని నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం మహా పూర్ణాహుతితో యాగ క్రతువు పూర్తయింది.