IND vs SA: వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. నిలకడగా ఆడుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (40), గిల్ (23) పరుగులు చేసి మంచి శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), అయ్యర్ (60) పరుగులతో ఉన్నారు.
Read Also: Air Pollution: వాయు కాలుష్యం బారినపడకుండా ఉండటానికి ఈ సలహాలు పాటించండి..!
భారత్ స్కోరు 32 ఓవర్ల వద్ద 2 వికెట్లు కోల్పోయి 198 పరుగుల చేసింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడా, కేశవ్ మహరాజ్ తలో వికెట్ తీశారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తాడనే అందరు అభిమానులు ఆశతో చూస్తున్నారు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్లో రెండు సెంచరీలు మిస్ కాగా.. తన బర్త్ డే సందర్భంగా సెంచరీ చేసి ఫ్యాన్స్కు గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు. అదే దూకుడుతో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. చూడాలి మరీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి సచిన్ రికార్డును సమం చేస్తాడా…..
Read Also: Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు