ఈరోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది.
ప్రపంచకప్ 2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే వరుణుడు ఒక్కసారి అడ్డుతగలగా.. మరోసారి ప్రత్యక్షమయ్యాడు. దీంతో మళ్లీ ఆటను ఆపేశారు.
ఆస్ట్రేలియాతో సిరీస్ కు టీమిండియా బాధ్యతలు ఎవరు చేపడుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఓ పక్క రోహిత్ శర్మ ఆటడం లేదు, మరోపక్క వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కాలికి గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచే దూరమయ్యాడు. అయితే అతను పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి తగిలింది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ఒకవేళ ఇలానే వర్షం పడితే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాకిస్తాన్ జట్టుకు కలిసొచ్చే అవకాశముంది. డీఎల్ఎస్ ప్రకారం చూసుకుంటే.. పాకిస్తాన్ 10 పరుగులు ఎక్కువ సాధించింది. ఈ క్రమంలో ఒకవేళ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే, పాకిస్తాన్ ను విజేతగా ప్రకటిస్తారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు బెంగళూరులో న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు చెత్త రికార్డును నెలకొల్పారు. ముఖ్యంగా స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది అత్యంత చెత్తరికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్తాన్ బౌలర్‌గా అఫ్రిది నిలిచాడు.
2023 వరల్డ్ కప్లో భాగంగా.. రేపు (ఆదివారం) ఇండియా-సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగునుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఇరుజట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచి టేబుల్ టాప్లో ఉన్న టీమిండియా మంచి జోరు ఉంది. అటు సౌతాఫ్రికా కూడా మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ రేపు రసవత్తరంగా జరుగబోతుంది.
న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆడుతున్న తొలి వరల్డ్ కప్లోనే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రవీంద్ర రికార్డుల్లోకెక్కాడు. ఈ వరల్డ్ కప్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 3 శతకాలు నమోదు చేశాడు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టు పాకిస్తాన్పై వీరబాదుడు బాదింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఈ వరల్డ్ కప్లో రెండో అత్యధిక స్కోరు ఇదే. కివీస్ బ్యాటింగ్లో ఓపెనర్ల మంచిగా రాణించారు. రచిన్ రవీంద్ర (108) మరో సెంచరీ నమోదు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు.
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. గత ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ పై పిటిషన్ వేశారు. మహబూబ్ నగర్ వాసి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను ఇటీవల తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాఘవేందర్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సీపీఐ కార్యవర్గ సమావేశం అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్‌తో పొత్తుపై భిన్నాభిప్రాయాలు రావడంతో రాష్ట్ర సీపీఐ తుది నిర్ణయాన్ని కేంద్ర కమిటీకి అప్పగిస్తూ కమిటీ తీర్మానం చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడం సీటు ఇచ్చినా... మునుగోడులో పోటీ చేస్తామని నల్గొండ జిల్లా సీపీఐ నేతలు అంటున్నారు.