AUS vs ENG: వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీస్ ఆశలు మరింత బలమయ్యాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో లంబుషేన్ అత్యధికంగా 71 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 44, గ్రీన్ 47, స్టోయినీస్ 35, జంపా 29 పరుగులు చేశాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. మార్క్ ఉడ్, ఆదిల్ రషీద్ తలో రెండు వికెట్లు తీశారు. విల్లీ, లివింగ్ స్టోన్ చెరో వికెట్ దక్కింది.
Read Also: California: సరస్సులో చెత్తను తొలగిస్తుండగా సూట్‌కేస్‌లో మృతదేహం.. కాలిఫోర్నియాలో ఘటన
ఈ క్రమంలో 287 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 48.1 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో బెన్ స్టోక్స్ 64, డేవిడ్ మలాన్ 50, మొయిన్ అలీ 42, క్రిస్ వోక్స్ 32, ఆదిల్ రషీద్ 20 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అత్యధికంగా ఆడం జంపా 3 వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్, హేజిల్ ఉడ్, కమిన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మార్కస్ స్టోయినీస్ కు ఒక వికెట్ దక్కింది.
Read Also: PM Modi: “రక్షించాలని ప్రపంచాన్ని కోరుతున్నారు”.. పాకిస్తాన్‌పై ప్రధాని సెటైర్లు..