Rajesh Veeramalla
Author- NTV Telugu-
World Cup 2023: వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ మ్యాచ్ టికెట్ విక్రయాలు నేడే…
ఈ మెగా టోర్నీలో నవంబరు 15న తొలి సెమీఫైనల్, నవంబరు 16న రెండో సెమీఫైనల్ జరగనుంది. నవంబరు 19న ఫైనల్ నిర్వహించనున్నారు. ఈ మూడు నాకౌట్ మ్యాచ్ ల కోసం తుది విడత టికెట్లను ఈరోజు విక్రయించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తెలిపింది. అధికారిక వెబ్ సైట్ https://tickets.cricketworldcup.com. ద్వారా కూడా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. -
AUS vs AFG: వరల్డ్ కప్లో రికార్డు.. ఒంటిచేతితో గెలిపించిన మ్యాక్సీ
వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. -
Health Tips: పరగడపున ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంత మంచిది తెలుసా..!
యాపిల్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన చాలా పోషకాలు కలిగి ఉంటాయి. దానిలో చాలా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. డైజెస్టివ్ అసిస్టెన్స్, అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, బ్రెయిన్ డ్యామేజ్‌ని నివారించడంలో సహాయపడుతాయి. ఆపిల్ తో మధుమేహం, ఆస్తమా, ఆస్తమా నివారణ, బరువు తగ్గడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా.. ఆపిల్ తింటే గుండె ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. యాపిల్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందాయి. -
Health Tips: ఉదయాన్నే ఈ తప్పులు చేస్తున్నారా.. జాగ్రత్తగా ఉండండి..!
ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో బెడ్ మీద నుంచి లేవగానే.. ఉరుకులు పరుగులు మొదలు పెడతాం. ఫాస్ట్‌గా బ్రష్ చేసి.. టీ, కాఫీ ఒక గుక్కలో నోట్లో పోసుకుని.. టైమ్ లేదని టిఫిన్ తినడం మానేసి ఆఫీసులకు వెళ్లిపోతుంటారు. ఉదయం మనం లేవగానే చేసే పనుల ప్రభావం.. ఆ రోజంతా ఉంటుంది. మన రోజు చికాకుగా మొదలు పెడితే.. ఆరోజంతా విసుగ్గానే ఉంటుంది. ప్రతి రోజూ ఇలాగే అలవాడు పడితే.. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదయం లేవగానే… -
Rishabh Pant: స్పెషల్ ట్రెడ్‌మిల్‌పై రిషబ్ పంత్ రన్నింగ్.. వీడియో వైరల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారణంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్ 2023లో ఆడలేకపోయాడు. అయితే నాసాలో శిక్షణ పొందుతున్న రిషబ్.. ట్రైనింగ్ సెషన్‌లో బాగా చెమటలు పట్టిస్తున్నాడు. -
Diwali Festival: దీపావళి రోజు వీటిని చూస్తే శుభసూచకం..!
దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు నివసిస్తారని ప్రతీతి. -
AUS vs AFG: ఆస్ట్రేలియాపై ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్ రికార్డ్.. ప్రపంచ కప్‌లో తొలిసారిగా..!
ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు. -
Health Problems: ఉప్పు ఎక్కువగా తినేవారికి ఆ ఆరోగ్య సమస్యలు వస్తాయంట..!
ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేకుండా ఆహారం తినాలంటే చాలా కష్టం. అలాగని గుప్పిళ్లతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. -
BAN vs SL: వరల్డ్ కప్ నుంచి శ్రీలంక ఔట్.. 3 వికెట్ల తేడాతో బంగ్లా గెలుపు
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఢిల్లీలో బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో శ్రీలంకను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో బంగ్లాదేశ్ తొలిసారిగా శ్రీలంకను ఓడించింది. బంగ్లా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
Supreme Court: సుప్రీంకోర్టుకు మరో ముగ్గురు కొత్త న్యాయమూర్తులు.. కొలీజియం సిఫార్సు
ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి.. సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 34 కాగా, అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
TGSRTC: ఆర్టీసీ సమ్మె షురూ.. రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు..
-
50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!
-
Cherlopalli Incident: సభ్యసమాజం తలదించుకునే ఘటన.. 50 మంది కార్మికులపై యజమాని..!
-
PM Modi: పహల్గామ్ ఉగ్ర బాధితులకు మోడీ నివాళి
-
MS Dhoni Return: వాంఖడేలో హై వోల్టేజ్ పోరు.. సీఎస్‌కేకు గుడ్ న్యూస్, దిగ్గజం దిగుతున్నాడు!
ట్రెండింగ్
-
Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!