యాపిల్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన చాలా పోషకాలు కలిగి ఉంటాయి. దానిలో చాలా యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. డైజెస్టివ్ అసిస్టెన్స్, అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, బ్రెయిన్ డ్యామేజ్‌ని నివారించడంలో సహాయపడుతాయి. ఆపిల్ తో మధుమేహం, ఆస్తమా, ఆస్తమా నివారణ, బరువు తగ్గడాన్ని నివారించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా.. ఆపిల్ తింటే గుండె ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది. యాపిల్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలకు విస్తృతంగా ప్రసిద్ది చెందాయి. రోజుకు ఒక యాపిల్ డాక్టర్‌ను దూరంగా ఉంచుతుందని చాలా మంది నమ్ముతారు. అయితే ప్రతిరోజు పరగడుపుతో ఒక యాపిల్ తినడం మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Health Tips: ఉదయాన్నే ఈ తప్పులు చేస్తున్నారా.. జాగ్రత్తగా ఉండండి..!
యాపిల్ లో ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది తిన్నవెంటనే జీర్ణమవుతుంది. అంతేకాకుండా.. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని చాలావరకు నియంత్రిస్తుంది. అంటే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్ లో క్వెర్సెటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడడంలో శరీరానికి ఎంతో దోహదపడతాయి. యాపిల్ తింటే బరువు అదుపులో ఉంటుంది.
Game Changer : జరగండి పాట వచ్చేస్తుంది.. ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి..
ఈ పండులో విటమిన్ ‘డి’ ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది.. గట్టి పడతాయి. యాపిల్ లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహంతో బాధపడేవారికి మంచిది. యాపిల్ లోని విటమిన్ ‘సి’ శరీరంలోని ఆరోగ్యకరమైన కొల్లాజెన్ ను ప్రోత్సహిస్తుంది. ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా.. చర్మ సంబధింత వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ఆపిల్ తింటే.. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలు దూరం అవుతాయి.