వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కివీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో శ్రీలంక ఖాతాలో మరో ఓటమి నమోదైంది. మరోవైపు న్యూజిలాండ్ కు ఈ విజయంతో సెమీస్ అవకాశాలు మరింత బలమయ్యాయి. కాగా.. సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న పాక్ జట్టు ఆశలు గల్లంతయ్యాయి.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు.
ప్రముఖ బాలీవుడ్ నటి మహ్మద్ షమీతో ప్రేమలో పడింది.. అంతేకాదు పెళ్లికి కూడా ప్రపోజ్ చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.. ట్వీట్‌లో మహ్మద్ షమీపై తన ప్రేమను వ్యక్తం చేసింది. షమీ.. నువ్వు ఇంగ్లీష్‌ని మెరుగుపరుచుకో, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది.
గత నెలలో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ని పెంచింది. ఆ తర్వాత.. దీపావళికి ముందు డీఏ పెంచే ప్రకటనలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగాయి. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్, అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, చండీగఢ్‌లలో డీఏను పెంచి పండుగకు ముందు ఉద్యోగులకు సంతోషాన్ని ఇచ్చారు.
విషపూరితమైన గాలి, ఆహారపు అలవాట్ల కారణంగా చర్మ సమస్యలు వస్తాయి. వాతావరణ కాలుష్యం కారణంగా.. శ్వాసకోశ వ్యాధులతో పాటు చర్మ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో దురద కలిగించే చర్మ వ్యాధి ఇబ్బందికరంగా మారుతుంది. అయితే శరీరంలో దురద, అలర్జీ లాంటివి అనిపిస్తే వెంటనే డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.
వన్డే ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెండ్ బౌల్ట్ ఓ అరుదైన ఘనత సాధించాడు. తన జట్టు తరుఫున 50కు పైగా వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా బౌల్ట్ రికార్డ్ సృష్టించాడు. ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కుశాల్ మెండీస్ వికెట్ తీసి ఈ ఫీట్ సాధించాడు.
వారణాసిలోని పరమానందపూర్‌కు చెందిన కళావతి దేవి అనే 103 ఏళ్ల వృద్ధురాలు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు కారణం తన ఫిట్‌నెస్. 103 ఏళ్ల వయసులో కూడా ట్రాక్‌పై పరుగెత్తుతూ ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని యువతకు తెలుపుతుంది. ఇదిలా ఉంటే.. కాశీలో జరిగిన ఎంపీ క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో ఆమే పేరును నమోదు చేసుకుని.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రపంచకప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శన చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లోనూ అన్నింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానంలో ఉంది. లీగ్ దశలో కేవలం నెదర్లాండ్స్‌తో మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ముంబైలోని వాంఖడే స్టేడియంలో నెంబర్ 4 జట్టుతో భారత్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ వరల్డ్ కప్లో టీమిండియా గెలవడమే కాదు.. అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శనను చూపిస్తుంది. దీంతో ప్రత్యర్థి జట్లను ఓడించి ఏకపక్షంగా చాలా మ్యాచ్‌లను గెలుచుకుంది.
వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ కు దిగింది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ కుశాల్ పెరీరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్రీజులో ఉన్నంతసేపు కివీస్ బౌలర్లకు పెరెరా చుక్కలు చూపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి అర్ధసెంచరీ సాధించాడు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తదుపరి సీజన్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే WPL 2024 గురించి కొన్ని వార్తలు వినపడుతున్నాయి. మీడియాలో వస్తున్న తాజా నివేదికల ప్రకారం.. వచ్చే ఏడాది WPL 2024 సీజన్‌ను ఇండియాలోని రెండు నగరాల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ నగరాల్లో ముంబై, బెంగళూరు ఉన్నాయి. అంతేకాకుండా.. ఐపీఎల్ తరహాలోనే డబ్ల్యుపీఎల్ సీజన్ నిర్వహించనున్నట్లు నివేదికలు వచ్చాయి.