Diwali Festival: దీపావళి రోజు వీటిని చూస్తే శుభసూచకం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు నివసిస్తారని ప్రతీతి. దీపావళి రోజు లక్ష్మీదేవి సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక సంకేతాలు కనిపిస్తాయట. అంతేకాకుండా.. దీపావళి రోజు మీరు కొన్ని జీవులను చూస్తే అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందులో ఏవేవీ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవు
హిందూ మతంలో శకున శాస్త్రం ప్రకారం ఆవుకి తల్లి హోదా ఉంటుంది. దీపావళి రోజున కుంకుమపువ్వు రంగులో ఉన్న ఆవును చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఆవును దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు. దీపావళి రోజున దాని దర్శనం శ్రేయస్సు యొక్క చిహ్నంగా పరిగణిస్తారు. శకున శాస్త్రం ప్రకారం, చిన్న చిన్న విషయాలు కూడా మన భవిష్యత్తు గురించి చాలా చెబుతాయి. దీపావళి రోజున ఈ రంగులో ఉన్న ఆవును చూస్తే మీ ఇంటికి ఐశ్వర్యం, సంపదలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
పిల్లి
ఇంట్లోకి పిల్లి రావడం చాలా శుభప్రదంగా చెబుతారు. దీపావళి నాడు మీరు పిల్లిని చూస్తే అది ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీన్ని లక్ష్మీదేవి రాకకు సంకేతంగా భావిస్తారు. చూసిన వ్యక్తికి ధనలాభం కలుగుతుందని నమ్ముతారు.
బల్లులు
బల్లులు సాధారణంగా ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. దీపావళి పండుగ పర్వదినాన రాత్రి గణేష్-లక్ష్మీ పూజ తర్వాత వీటిని చూడటం శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. దీపావళి రోజున బల్లిని చూడటం అంటే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోందని సంకేతమంటున్నారు.
చీమ
దీపావళి రోజు మీ ఇంట్లో నల్ల చీమను చూడటం శుభసూచికమే. మీ ఇంట్లో బంగారు వస్తువులు ఉంచిన చోట నల్ల చీమలు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం. అలాగే మీ ఇంటి పైకప్పు నుంచి చీమలు బయటకు రావడం కూడా శుభసూచకమే. అంటే మీకు ఆకస్మిక డబ్బు కలుగుతుందని అర్థం.
గుడ్లగూబ
దీపావళి రోజు రాత్రి గుడ్లగూబ కనిపిస్తే ఇక వారు పట్టిందల్లా బంగారమే అవుతుందట. లక్ష్మీదేవికి వాహనంగా గుడ్లగూబను చెప్తారు. పండుగరోజు రాత్రి గుడ్లగూబను చూస్తే ఐశ్వర్యంతోపాటు, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!