ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి.. సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 34 కాగా, అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియంలో చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
Read Also: Sharwanand: తండ్రి కాబోతున్న శర్వానంద్.. ?
సతీష్ చంద్ర శర్మ 1961 నవంబర్ 30న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జన్మించారు. 42 ఏళ్ల వయసులో శర్మ మధ్యప్రదేశ్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేశారు. ఆ తర్వాత శర్మ 2008లో మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. రెండేళ్ల తర్వాత, అంటే 2010లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సతీష్ చంద్ర శర్మ 28 జూన్ 2022న నియమితులయ్యారు.
Read Also: Ananya Nagalla : ఇండస్ట్రీ లో రేసు లో ఉండాలంటే ఆ పని చేయాల్సిందే..
ఆగస్టిన్ జార్జ్ మాసిహ్ 1963 మార్చి 12న జన్మించాడు. మసీహ్ 10 జూలై 2008న పంజాబ్, హర్యానా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2011 జనవరి 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మసీహ్ 30 మే 2023 నుండి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సందీప్ మెహతా 2011 మే 30న రాజస్థాన్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 6 ఫిబ్రవరి 2013న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మెహతా 15 ఫిబ్రవరి 2023 నుండి గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.