టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది చివరిలో రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురై.. తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కారణంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్, వరల్డ్ కప్ 2023లో ఆడలేకపోయాడు. అయితే నాసాలో శిక్షణ పొందుతున్న రిషబ్.. ట్రైనింగ్ సెషన్‌లో బాగా చెమటలు పట్టిస్తున్నాడు.
Read Also: Putin: 2030 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
అందుకు సంబంధించిన ఓ వీడియోను రిషబ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోలో రిషబ్ పంత్ యాంటీ గ్రావిటీ ట్రెడ్‌మిల్‌పై పరుగెడుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంతేకాకుండా.. ఈ వీడియో క్యాప్షన్‌లో షార్ట్‌కట్‌లు లేవు, పూర్తి హార్డ్ వర్క్ అని రాశాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఈ వీడియోపై అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ ద్వారా తమ స్పందనను తెలియజేస్తున్నారు.
Read Also: Congress: జగ్గారెడ్డి వర్సెస్ దామోదర రాజనర్సింహ.. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ
ఈ వీడియోలో రిషబ్ పంత్ నడుస్తున్న ట్రెడ్‌మిల్ అంతర్జాతీయ అథ్లెట్ల పునరావాసంలో ఉపయోగిస్తారు. అయితే.. నాసా సహకారంతో ఈ ప్రత్యేక ట్రెడ్‌మిల్‌ను తయారు చేశారు. వ్యోమగాములను సిద్ధం చేసేందుకు నాసా ఈ ట్రెడ్‌మిల్‌ను ఉపయోగించింది. నాసా తయారు చేసిన ఈ ట్రెడ్‌మిల్ ధర దాదాపు 4 నుంచి 7 కోట్ల ధర ఉంటుంది.