ఆస్ట్రేలియాపై ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఇబ్రహీం జద్రాన్ 131 బంతుల్లో సెంచరీ మార్కును తాకాడు. ఈ ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా ఇబ్రహీం జద్రాన్ నిలిచాడు. 143 బంతుల్లో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ సాధించలేదు. 2015 నుంచి వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న అఫ్గానిస్తాన్ తరఫున ఇంతవరకూ (ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు) ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ నమోదు చేయలేదు.
Read Also: Israel: భారతీయులకు కలిసి వస్తున్న ఇజ్రాయిల్-గాజా యుద్ధం.. లక్ష మందికి పని..
ఇబ్రహీం జద్రాన్ వన్డే కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ. ఇబ్రహీం జద్రాన్ 27 వన్డే మ్యాచ్‌లలో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 52.08 సగటుతో 1250 పరుగులు చేశాడు. 5 సెంచరీలు చేయడంతో పాటు.. ఇబ్రహీం జద్రాన్ తన వన్డే కెరీర్‌లో 5 సార్లు యాభై పరుగుల మార్క్‌ను దాటాడు. ప్రపంచకప్‌లో ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో ఇదే అత్యధిక స్కోరు. గతంలో ఈ రికార్డు సమీవుల్లా షిన్వారీ పేరిట ఉండేది. ప్రపంచ కప్ 2015లో.. సమియుల్లా షిన్వారీ స్కాట్లాండ్‌పై 96 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఇబ్రహీం జద్రాన్ (2023లో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 87), ఇక్రామ్ అలిఖిల్ (2019లో వెస్టిండీస్‌పై 86), హష్ముతుల్లా షాహిది (2023లో ఢిల్లీలో భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో 80) లు టాప్-5లో ఉన్నారు.
Read Also: Health Problems: ఉప్పు ఎక్కువగా తినేవారికి ఆ ఆరోగ్య సమస్యలు వస్తాయంట..!
ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హష్మతుల్లా షాహిదీ ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో జట్టు తరఫున ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ 80 పరుగులు చేశాడు. ఆ తర్వాత రహ్మానుల్లా గుర్బాజ్.. ఇంగ్లండ్‌పై 80 పరుగులు చేశాడు. ఇక.. ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది.