ఉప్పు ప్రకృతిలో అత్యద్భుతమైన సృష్టి అంటే అది అతిశయోక్తి కానేరదు. ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉప్పు తప్పనిసరిగా ఉండాలి. ఉప్పు లేకుండా ఆహారం తినాలంటే చాలా కష్టం. అలాగని గుప్పిళ్లతో బుక్కెయ్యక్కర లేదు. రోజుకి 200 మిల్లీగ్రాములు తింటే చాలు. అయితే చాలామంది కేవలం రుచి కోసమే పలు వంటకాలను చేసుకుని వాటిని ఆస్వాదిస్తుంటారు. అయితే చాలా వరకు వంటకాలు ఏవైనా సరే.. ఉప్పు లేకుండా వాటికి రుచికాదు. తీపి పదార్థాలు పక్కన పెడితే మిగిలిన కూరలు, ఇతర ఏ వంటకంలోనైనా సరే.. ఉప్పు తప్పని సరిగా ఉపయోగించాలి. ఉప్పు మంచిదే.. అందుకని మోతాదుకు మించి తీసుకుంటే.. అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
VarunLav: నెట్ ఫ్లిక్స్ లో వరుణ్ – లావణ్య పెళ్లి వీడియో.. రూ. 8 కోట్లకు ఫిక్స్..?
ముఖ్యంగా ఎక్కువగా ఉప్పు వాడేవారికి షుగరు వస్తోందని అమెరికాలోని టులానే యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అందుకోసం ఉప్పును మానుకోవడం మంచిది. అంతేకాకుండా.. ఉప్పువల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్లు తేలింది. దాదాపు నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించారు. అసలు ఉప్పు వేసుకోనివారు, అప్పుడప్పుడు ఉప్పు వేసుకునేవారు, ప్రతిసారీ ఉప్పు ఎక్కువగా వాడేవారిని పరిశీలించగా తినే ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నట్లు తేలింది.
Air Pollution: మాకు ఓపిక లేదు, ఆ పొగను అరికట్టండి.. సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్..
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పేరుకుపోతుంది. దీని వలన శరీరం సోడియంను పలుచన చేయడానికి ఎక్కువ ద్రవాన్ని పట్టుకుంటుంది. రక్త ప్రవాహంలో ద్రవం పరిమాణం పెరగడం వలన అధిక రక్తపోటుకు దోహదం చేస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ మరియు మూత్రపిండాల సమస్యలకు దోహదం చేస్తుంది. అధిక ఆహార సోడియం రక్త నాళాలు, గుండె, మూత్రపిండాలు మరియు మెదడును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు.. బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ లో నమోదైనవారి ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించారు. అరుదుగా ఉప్పు తినేవారికి షుగరు ముప్పు కేవలం 13 శాతమే ఉంటోంది. కొన్నిసార్లు వేసుకునేవారికి 20 శాతం, ప్రతిసారీ ఉప్పు వేసుకునేవారికి 39 శాతం షుగరు వచ్చే ముప్పు కనపడుతోంది. ఊబకాయం ఉన్నవారిలో, కణ అంతర్గత వాపు ప్రక్రియ మరింత పెరుగుతున్నట్లు తేలింది.