Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌పై వ్యాపారవేత్తల కళ్లు.. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీపావళి పండుగతో మార్కెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌పై బడా వ్యాపారులతో పాటు చిరు వ్యాపారుల కన్ను పడింది. నవంబర్ 23 తర్వాత దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుంది.. ఈ నేపథ్యంలో మార్కెట్లో షాపింగ్ మరోసారి పెరిగి రూపాయి చలామణి ప్రారంభంకానుంది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ రాబోయే ఇతర పండుగలతో సహా భారతదేశంలో మొత్తం రూ. 25 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని చిరు వ్యాపారుల సంస్థ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) అంచనా వేసింది.
Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఇదిలా ఉంటే.. నవరాత్రి నుండి దీపావళి వరకు దేశంలోని ప్రధాన రిటైల్ వ్యాపారంలో రూ. 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఇందులో దుర్గాపూజ, ఇతర పండుగల సమయంలోనే దాదాపు రూ.50 వేల కోట్ల వ్యాపారం జరిగింది. గతంలో గణేష్ చతుర్థి 10 రోజుల వేడుకల్లో రూ.20-25 వేల కోట్ల వ్యాపారం జరిగింది. ప్రస్తుతం.. ఈ గణాంకాలు ప్రధానంగా 3 పెద్ద పండుగలకు మాత్రమే ఉన్నాయి. రక్షాబంధన్, జన్మాష్టమి, మహాశివరాత్రి, హోలీ సందర్భంగా జరిగిన వ్యాపారాన్ని కూడా కలుపుకుంటే ఈ లెక్కన కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.
Naga Chaitanya: ఎంత మంచి మనసు సామీ నీది.. ఎక్కేశావ్ .. అభిమానుల గుండెల్లో ఓ మెట్టు ఎక్కేశావ్
దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయని ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. ఈ ఆలయాలను సందర్శించే భక్తులు ప్రతిరోజూ కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఈ సంఖ్య లక్షల కోట్లు అవుతుంది. దీనికి పండుగల ఆచారాలు, పెళ్లిళ్లకు చేసే ఖర్చు, తీర్థయాత్రల ఖర్చులు కలిపితే, ప్రపంచంలోని 100కి పైగా దేశాల మొత్తం జీడీపీ కంటే రూపాయి చలామణి ఎక్కువ అవుతుంది. ఇది కొత్త విధానం కాదనీ.. వేల ఏళ్లుగా కొనసాగుతోందన్నారు. మరోవైపు.. ఒక్క ధన్‌తేరస్ డే డేటా ఆధారంగానే ఈ ఒక్కరోజే రూ.25,500 కోట్ల విలువైన 41 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు క్యాట్ వెల్లడించింది. అటు వెండి అమ్మకాలు రూ.3000 కోట్లకు చేరుకున్నాయి. కార్ల తయారీదారులు 55,000 కార్లను డెలివరీ చేయగా, 5 లక్షలకు పైగా స్కూటర్లు, మోటార్ సైకిళ్లను డెలివరీ చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!