Vivo వినియోగదారుల కోసం కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo Y100i 5Gని చైనాలో రహస్యంగా విడుదల చేసింది. కంపెనీ Y సిరీస్‌లో విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ ర్యామ్, ఎక్కువ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఫీచర్ల గురించి మాట్లాడితే.. ఈ Vivo స్మార్ట్‌ఫోన్ ఫోటోలు, వీడియోలు, ఇతర వస్తువులను సేవ్ చేయడానికి 12 GB RAM, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. Vivo Y100i 5G మొబైల్ ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.
Rassie Vander Dussen: కళ్లు మూసి తెరిచేలోగా క్యాచ్.. ఈ వరల్డ్ కప్లో బెస్ట్ ఇదేనేమో..!
డిస్ ప్లే
మీడియాటెక్ డైమెన్షన్ 6020 చిప్‌సెట్ వేగం, మల్టీ టాస్కింగ్ కోసం ఈ పరికరంలో ఉపయోగించారు. అంతేకాకుండా.. ఈ ఫోన్ పూర్తి-HD రిజల్యూషన్‌తో 6.64 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 240 Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది.
కెమెరా
కెమెరా సెటప్ గురించి మాట్లాడుతూ.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ AI కెమెరా సెన్సార్ అందించారు. ఫ్రంట్ కెమెరాలో 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ అందుబాటులో ఉంటుంది.
బ్యాటరీ
ఫోన్ బ్యాటరీ విషయానికొస్తే.. 5000 mAh బ్యాటరీ అందించారు. ఇది 44 వాట్ల ఫాస్ట్ ఛార్జ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ కోసం ఈ పరికరంలో 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది.
ధర
ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో బ్లూ, పింక్ అనే రెండు కలర్ వేరియంట్‌లు ఉన్నాయి. 12 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజీని అందించే మోడల్ ధర రూ. 18 వేల 400గా ఉంది. ప్రస్తుతానికి, ఈ పరికరం భారతీయ మార్కెట్లో వినియోగదారుల కోసం లాంచ్ చేయబడుతుందా లేదా అనే సమాచారం వెల్లడి కాలేదు.