2023 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 101 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి గౌరవప్రదమైన స్కోరును నమోదు చేశాడు.
Read Also: World Cup 2023: టీమిండియాలో ఇప్పటివరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది వీరినే..
24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టును డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యంతో రాణించారు. ఇక ఆ తర్వాత గెరాల్డ్ కోయెట్జీతో కలిసి మిల్లర్ ఏడో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మొదట క్రీజులోకి దిగిన సౌతాఫ్రికా మంచి ఆరంభాన్ని అందించలేదు. తొలి ఓవర్లనే డకౌట్ రూపంలో కెప్టెన్ బావుమా పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత క్వింటన్ డి కాక్ (3), ఐడెన్ మార్క్రామ్ (10), రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (6) పరుగులు చేశారు. మార్కో యాన్ సేన్ డకౌట్ కాగా.. కోయెట్జీ (19), కేశవ్ మహరాజ్ (4), కగిసో రబాడా (10), షంసీ (1) పరుగులు చేశారు.
Read Also: Mangalavaaram : మంగళవారం మేకింగ్ వీడియో అదిరిపోయింది గా..
ఇక.. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. జోష్ హేజిల్ ఉడ్, ట్రేవిస్ హెడ్ చెరో వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా విజయలక్ష్యం 213 పరుగులు చేయాల్సి ఉంది.