Hair Care: ఈ ఆకు రాస్తే మీ జుట్టు రాలడం ఆగి పొడవు పెరుగుతుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటం కోసమని వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే మీరు మీ జుట్టు పొడవును పెంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో మనకు కరివేపాకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి, సి, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనె-కరివేపాకు
మీరు జుట్టు పెరుగుదలను పెంచుకోవాలనుకుంటే.. కొబ్బరి నూనెలో కరివేపాకును కలపండి. అందుకోసం ముందుగా బాణలిలో కొబ్బరి నూనె తీసుకుని అందులో 8 నుంచి 9 కరివేపాకు వేసి మరిగించాలి. బాగా చల్లారిన తర్వాత మీ తలకు, జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయండి. సుమారు గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి.
Also Read
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
కరివేపాకు-మెంతులు
జుట్టు ఒత్తుగా ఉండాలంటే కరివేపాకుతో పాటు మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా కరివేపాకును పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో రెండు చెంచాల మెంతిపొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. మీరు దీన్ని వారానికి 2 నుండి 3 సార్లు ఉపయోగించవచ్చు.
కరివేపాకు-ఉసిరి
జుట్టు పెరగాలంటే కరివేపాకు, జామకాయతో హెయిర్ మాస్క్ తయారు చేసి అప్లై చేసుకోవచ్చు. అందుకోసం.. ఒక ఉసిరికాయను మిక్సీలో రుబ్బుకోవాలి. తర్వాత అందులో ఒక చెంచా కరివేపాకు పేస్ట్ వేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు అప్లై చేసి సుమారు 1 గంట పాటు అలాగే ఉంచండి. ఈ హెయిర్ మాస్క్‌తో మీ జుట్టు పెరగడమే కాకుండా నిగనిగలాడుతుంది.
తాజావార్తలు
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
-
Aishwarya Lekshmi: బన్నీ – అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
-
Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
-
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!