మహదేవ్ బెట్టింగ్ యాప్ ఉచ్చులోకి మొదట బాలీవుడ్ సెలబ్రిటీలు, ఆ తర్వాత రాజకీయ నాయకుల పేర్లు వచ్చాయి. కానీ ఈ ఉచ్చు మరింత బిగుస్తుంది. క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అనే పేరు నుంచి ఇప్పుడు వ్యాపార ప్రపంచానికి చేరుకుంది. ఆయుర్వేద ఔషధాల తయారీలో (FMCG) రంగంలోని పెద్ద కంపెనీల్లో ఒకటైన డాబర్ గ్రూప్‌లోని ఉన్నతాధికారులు దీని ట్రాప్లో పడిపోయారు. దీంతో వారిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ప్రపంచకప్ లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ ల్లో ఓటమి ఎరుగని జట్టుగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో రేపు న్యూజిలాండ్ తో సెమీస్ లో తలపడనుంది. ఇంతకుముందు న్యూజిలాండ్-ఇండియా మధ్య మ్యాచ్ జరిగినప్పుడు టీమిండియాను కివీస్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరోవైపు టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్‌ను దెబ్బతీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చివరి దశకి చేరుకుంది. రేపు, ఎల్లుండి సెమీఫైనల్ మ్యాచ్ లు జరుగనుండగా... ఈ నెల 19వ తేదీన జరిగే ఫైనల్ జరుగనుంది. దీంతో ఈ మెగా టోర్నీ సమాప్తమవుతుంది. అయితే.. సెమీస్, ఫైనల్ మ్యాచ్ ల కోసం ఐసీసీ రిజర్వ్ డేలను కేటాయించింది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ జరగకపోతే రిజర్వ్ డేలో నిర్వహించనున్నారు.
వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ మ్యాచ్ లు ముగిసినప్పటికీ.. రేపు, ఎల్లుండి సెమీస్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ క్రమంలో రేపు (బుధవారం) తొలి సెమీస్ పోరు జరుగనుంది. ఈ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్-న్యూజిలాండ్ జట్లు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో రేపటి సెమీస్ మ్యాచ్ గురించి న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా ఏం చేయాలి అనే ప్రశ్న టీమిండియా అభిమానులందరిలో మెదులుతోంది. అయితే.. ఈ ప్రశ్నపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఓ సలహా ఇచ్చాడు. ఈ బిగ్ మ్యాచ్‌లో పరుగులను ఛేజ్ చేయడం ఎప్పుడూ కష్టమేనని తన వీడియోలో చెప్పాడు. అంతేకాకుండా.. మొదట బ్యాటింగ్ చేస్తే భారత్ ఆలౌట్ అవుతుందని చెప్పాడు. వాంఖడేలో మంచు కురిసిన తర్వాత పరుగులను ఛేజింగ్ చేయడం ఎప్పుడూ కష్టమే, కానీ టీమిండియా ఇంతకుముందు ఆ పని చేసింది అని అన్నాడు.
వరల్డ్కప్ 2023లో భారత్ విజయాలతో దూసుకెళ్తుంది. లీగ్ మ్యాచుల్లో ఆడిన 9 మ్యాచ్ల్లో ఓటమెరుగని జట్టుగా నిలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో జట్టు వరుస విజయాలపై కోచ్ రాహుల్ ద్రవిడ్ కారణం వివరించాడు. జట్టు తనకు తానుగా ప్రత్యేకంగా ఓ టాస్క్ పెట్టుకుందని తెలిపాడు.
పశ్చిమ లండన్‌లోని హౌన్స్‌లోలో ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా భారతీయ సంతతికి చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసుల కళ్లు గప్పి కరడుగట్టిన నేరస్తుడు పరారైన ఘటన యూపీలో చోటుచేసుకుంది. కాన్పూర్‌లోని లాలా లజ్‌పత్ రాయ్ హాలెట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నేరస్తుడు పోలీసులను నుంచి బయటపడ్డాడు. ఈ క్రూరమైన నేరస్తుడు నకిలీ ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తూ ప్రజల నుంచి దోపిడీలకు పాల్పడుతున్నడనే నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మనవరాలు నవోమీ బిడెన్ భద్రతలో భారీ లోపం వెలుగు చూసింది. ముగ్గురు దుండగులు నవోమి ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగులగొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. దీంతో కారుపై దాడి చేయడాన్ని చూసి.. నవోమి భద్రత కోసం మోహరించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు.
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా గుహ గ్రామంలో కొందరు ముస్లిం వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు భక్తులను, పూజారిని కొట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఈనెల 9న లార్డ్ కనిఫ్నాథ్ ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు, పూజారిపై ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.