శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూస్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ నిధుల చట్టాలు (ఫెమా) ఉల్లంఘించినందుకు రూ.9000 కోట్లు చెల్లించాల్సిందిగా ఆ సంస్థకు ఈడీ నోటీసులిచ్చినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం తెలిపాయి.
విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం రికార్డులపై టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కన్ను వేశాడు. సూర్య.. టీ20ల్లో అత్యంత వేగంగా 2000 పరుగులకు కేవలం 159 పరుగులు కావాలి. ఆ పరుగులు చేస్తే.. 52 ఇన్నింగ్స్‌లలో అత్యంత వేగంగా మైలురాయిని చేరిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సమం చేస్తాడు.
2023 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. టీమిండియాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కోట్లాది మంది అభిమానులు.. ఇప్పటికీ ఆ బాధ నుంచి తేరుకోవడం లేదు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నారు అక్కడి జనాలు. అందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించేందుకు పాకిస్తాన్ తమ మాజీ బౌలింగ్ స్టార్లలో ఇద్దరిని నియమించింది. ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఉమర్ గుల్, స్పిన్ బౌలింగ్ కోచ్ గా సయీద్ అజ్మల్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నియమించింది.
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని 'ది అరేనా బై ట్రాన్స్‌స్టాడియా'లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లీగ్ దశలో మొత్తం 12 జట్ల మధ్య 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 10.. డిసెంబర్ 2 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు జరగనుంది. ఈ…
భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో భారత్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లతో పాటు బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ ముగిసింది. ఆ తర్వాత అభిమానులు ఎదురుచూసేది ఐపీఎల్ కోసం. 2024 ఐపీఎల్ వేలం వచ్చే నెలలో నిర్వహించనున్నారు. అందులో పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లపై కాసుల వర్షం కురవడం ఖాయమనిపిస్తోంది.
విశాఖ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఈనెల 23న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పలువురు టీమిండియా ఆటగాళ్లు విశాఖకు చేరుకున్నారు.
ప్రపంచకప్ ఫైనల్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టింది. అంతేకాకుండా ఆటగాళ్ల ముఖాల్లో ఇప్పటివరకు ఓటమి బాధ పోవడంలేదు. అయితే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో ఓటమి బాధను వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌లో భారత ఆటగాళ్లందరూ ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ బాలికను బహిరంగంగా కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఉదయం 9.30 గంటలకు ఝాన్సీ రోడ్డులోని బస్టాండ్‌లో ఒక అమ్మాయి తన కుటుంబంతో సహా దిగింది. అయితే ఆ సమయంలో.. తన తమ్ముడిని టాయిలెట్‌కు తీసుకెళ్దామని సమీపంలోని పెట్రోల్ పంపు వద్దకు వెళ్లింది. ఇంతలోనే బైక్‌పై అక్కడికి వచ్చిన ఇద్దరు అగంతకులు.. బలవంతంగా యువతిని బైక్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లారు.