మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో గడ్డం వినోద్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. అంతేకాకుండా.. భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వినోదు భార్య పేర్లతో భారీగా ఆస్తులను గుర్తించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.
విశాఖ వేదికగా రేపు ఇండియా-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. వైజాగ్ లోని రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పల మహేందర్.. మహేశ్వరం BSP అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు.
వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, కోస్గి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారని ఆరోపించారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా 45 రోజులపాటు వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న టీమిండియా అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వరల్డ్ కప్ మహా సంగ్రామం ముగిసిపోయింది. దీంతో తర్వాత వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే వరల్డ్ కప్ లో కొందరు స్టార్ ఆటగాళ్లు దూరంకానున్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ మోతినగర్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్తి బండి రమేష్, ఆయన సతీమణి లకుమాదేవితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. భర్త గెలుపే లక్ష్యంగా సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా పక్కా ప్రణాళికతో లకుమాదేవి ఇంటింటా ప్రచారం చేశారు.
అంబర్పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ అయినా, ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా.. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని చెన్నారెడ్డి నగర్, ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్లలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు కాలేరు పద్మావతి, కార్పొరేటర్ లావణ్య గోల్నాకలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వెయ్యాలని వారు కోరారు.