ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నావెల్టీ సినిమా వెనుక ఉన్న కెనరా బ్యాంక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మంటలు భవనం మొత్తం వ్యాపించడంతో.. కొందరు ఉద్యోగులు భవనంపై నుండి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి. ఇదిలా ఉంటే.. బ్యాంకులో మంటల దాటికి బయటకురాకుండా 50 మంది చిక్కుకున్నట్లు సమాచారం అందుతోంది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ గ్లెన్ మాక్స్‌వెల్ భార్య వినీ రామన్‌పై దుర్భాషలాడారు. దీంతో.. భారత క్రికెట్ అభిమానులపై విని రామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అహ్మదాబాద్ లో నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది. పైకి నవ్వుతూ కనిపించిన ఆటగాళ్ల ముఖాలు.. లోపల మాత్రం గుండెల్లో చెప్పుకోలేనంత బాధ ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చిందుకే ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర విచారణలో ఉన్న మహమ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు.
జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో చూస్తుంటాం. కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కడుపుబ్బ నవ్వుకోవడం ఖాయం. ఈ వీడియోలో ఒక జంట నదిలో కలిసి స్నానం చేస్తుండగా.. ఉన్నట్టుండి ఓ కోతి వారి దగ్గరికి వచ్చింది. అయితే వారిద్దరు కలిసి స్నానం చేయడం ఆ కోతికి నచ్చలేదేమో. అందులో నుంచి వెళ్లేదాకా వదల్లేదు.
నిన్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా బ్యాటింగ్ చూస్తుంటే.. తగిన మూల్యం చెల్లించుకునేలా కనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. వరుసగా మ్యాచ్ లు గెలుస్తున్నప్పుడు సహజంగానే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఇప్పుడదే టీమిండియా కొంపముంచేలా ఉందని వ్యాఖ్యానించాడు.
మానవుడి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం జీవనశైలి, ఆహారం. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలున్నాయి.. ఒకటి చెడు కొలెస్ట్రాల్, ఇంకొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకోసం ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోవడం వలన చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ దీపావళిని అందరూ అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చక్కగా ముస్తాబై, రంగురంగుల బట్టలు ధరించి ఇంటిముందు పటాకులను పేల్చి ఉంటారు. ఇంకేముంది.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే. దీపావళి రోజు అందరూ టపాకాయలు పేల్చుతూ ఎంజాయ్ చేసిన వీడియోలు పోస్ట్ చేస్తే, ఓ మహిళ వెరైటీగా.. జడలో పువ్వులకు బదులుగా టపాకాయలు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మీరు రాత్రిపూట టాయిలెట్‌కి వెళ్లి అకస్మాత్తుగా ఎవరైనా మీ వెనుక నిలబడితే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ప్రాణాలు పోయేంత పని అవుతుంది. నిజంగానే గుండె సమస్యలు ఉన్నట్లైతే ప్రాణాలు కూడా పోవచ్చు. మాములుగా ఒంటరిగా హర్రర్ సినిమాలు చూస్తేనే.. కింది నుండి కారిపోతుంది. అలాంటిది చీకటి గదిలోకానీ, టాయిలెట్లలో ఏదో ఒక భయంకరమైన రూపం ఉంటే చాలా భయపడిపోతాం. అయితే ఇప్పుడు.. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు ఒకటి. అయితే అందులో కొన్ని పాములు విషపూరితమైనవి ఉంటే.. మరికొన్ని ప్రమాదకరమైనవి కానివి కొన్ని ఉంటాయి. భూమిపై ఉన్న పాములలో విషంలేనివి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే వాటికి విషం లేకున్నా కానీ.. అవి ప్రమాదకరం. ఆ జాతికి సంబంధించిన పాములలో కొండచిలువ, అనకొండ వంటివి ఉన్నాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా, పెద్దవిగా, బరువగా ఉంటాయి. అవి చిన్న జంతువులను సులభంగా నోటితో మింగగలవు. అంతేకాకుండా.. వాటి కండర శక్తితో వాటి ప్రాణాలు తీయగలవు. అయితే…
వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఉండి.. టైటిల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు కన్నీటిపర్యంతం అయ్యారు.