ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ కూడా ఉన్నారు.
వరల్డ్ కప్ 2023ఫైనల్ లో ఆస్ట్రేలియా గెలిచి ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. టైటిల్ పోరులో భారత్ ను చిత్తుగా ఓడించింది. భారత గడ్డపై జరిగిన ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఎగురేసుకుపోయింది. మొదట్లో రెండు మ్యాచ్ లు ఓడిపోయి.. ఆ తర్వాత పుంజుకుని అన్నీ మ్యాచ్ల్లో గెలుపొంది. ఇప్పుడు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ను ఒడిసిపట్టింది.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోవడంలో టీమిండియా విఫలమయ్యారని సునీల్ గవాస్కర్ అన్నారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. “రోహిత్ శర్మ ఓ తప్పుడు షాట్ ఆడి అవుట్ కావడం పెద్దదెబ్బ అన్నారు.
నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మహా సంగ్రామాన్ని వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్ అహ్మదాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ, రిచర్డ్ మార్లెస్ స్టేడియానికి చేరుకుని మ్యాచ్ ను తిలకించనున్నారు.
ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు.
ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆసీస్ సారథి పాట్ కమిన్స్ మీడియాతో మాట్లాడినట్లుగానే చేశాడు. స్టేడియంలో 1 లక్ష 32 వేల మంది టీమిండియా తరుఫున సపోర్ట్ చేస్తారని.. అభిమానులను ఎలా ఆశ్చర్యపరచాలో తనకు, తమ జట్టుకు తెలుసన్నాడు. అనుకున్నట్లు గానే చేసి చూపించాడు. టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ ఔట్ చేసి స్టేడియంలో ఉన్న అభిమానులందరినీ పిన్ డ్రాప్ సైలంట్ చేసి చూపించాడు. కోహ్లీ ఔట్ అవ్వడంతో స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు, విరాట్ సతీమణి అనుష్క శర్మ…
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీమ్ ఇండియా విజయాన్ని కాంక్షించారు. తన X (గతంలో ట్విటర్) ఖాతాలో.. ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 'మెన్ ఇన్ బ్లూ' అసాధారణమైన విజయాల రికార్డులను నెలకొల్పారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు, క్రికెట్ అభిమానులు టీమిండియాకు మద్దతు నిలుస్తున్నారని తెలిపారు.
గత 10 ఓవర్లు నుంచి టీమిండియాకు ఒక్క బౌండరీ రాలేదు. వెంట వెంటనే 3 వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నప్పుడే బౌండరీలు, సిక్సర్లు వచ్చాయి. దాదాపు గంట నుంచి టీమిండియాకు బౌండరీ రాలేదు. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు విఫలమవ్వడంతో నిలకడగా ఆడుతున్నారు. క్రీజులో విరాట్ కోహ్లీ (49), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు.
ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభమైన వెంటనే కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ అరుదైన రికార్డు సృష్టించాడు. కెప్టెన్‌గా ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.