ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని ‘ది అరేనా బై ట్రాన్స్‌స్టాడియా’లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లీగ్ దశలో మొత్తం 12 జట్ల మధ్య 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 10.. డిసెంబర్ 2 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ 12 నగరాల్లో జరగనున్నాయి. అన్ని జట్లు ఒక్కో నగరంలో 6 రోజుల పాటు ఆరు మ్యాచ్ లు ఆడనున్నాయి. ఆ తర్వాత మరో నగరానికి షిఫ్ట్ అవుతాయి. ఇదిలా ఉంటే.. సీజన్ ప్రారంభం 6 రోజులు అహ్మదాబాద్‌లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆ తర్వాత బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నా, ఢిల్లీ, కోల్‌కతా, పంచకులలో మ్యాచ్ లు జరుగనున్నాయి. లీగ్ మ్యాచ్‌ల అనంతరం ప్లేఆఫ్‌లు, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక.. ఈ సీజన్కు సంబంధించి షెడ్యూల్ తర్వలో రిలీజ్ కానుంది.
Read Also: Nirmala Sitharaman: తెలంగాణను కేసీఆర్ సర్కార్ అప్పుల రాష్ట్రంగా మార్చింది..
ఈసారి ఒక రోజులో రెండు మ్యాచ్‌లకు మించి మ్యాచ్ లు ఉండవు. రెండు మ్యాచ్‌లు జరగాల్సిన రోజు మొదటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఒక్ మ్యాచ్ ఉన్న రోజు 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే.. ఎక్కువగా రెండు మ్యాచ్‌లే ఎక్కువగా ఆడనున్నారు. ప్రతి ఆరు రోజుల తర్వాత విశ్రాంతి రోజు ఉంటుంది. ఆ సమయంలో అన్ని జట్లు ఒక నగరం నుండి మరొక నగరానికి మారుతాయి.
Read Also: 26/11 Mumbai Attacks: “భారతీయుల హత్యకు బాధ్యత”.. లష్కరే తోయిబాను ఉగ్రసంస్థగా ప్రకటించిన ఇజ్రాయిల్
కబడ్డీ ప్రేమికులు ప్రో కబడ్డీ మ్యాచ్‌లను స్టేడియానికి వెళ్లి చూడటమే కాకుండా.. ఇంట్లో టీవీ, యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో ప్రో కబడ్డీ మ్యాచ్‌లు లైవ్ రానుంది. అంతేకాకుండా.. డిస్నీ + హాట్ స్టార్‌లో లైవ్ అందుబాటులో ఉంటుంది.