హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. సెలక్షన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా.. తమకు ఇంతవరకు ట్రైనింగ్ పంపించకపోవడంపై విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చి.. అనంతరం సెలక్షన్స్ పూర్తయినా, మూడు నెలలు గడుస్తున్నా కోర్టు కేసుల పేరుతో తమకు అన్యాయం చేయడంపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ వెంటనే ట్రైనింగ్ పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్…
సంగారెడ్డిలో బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం ఏర్పడలేదు.. మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు మనకంటే బాగా చేయాలని కోరుకుందామని తెలిపారు. అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పొంగిపోలేదు.. లేనప్పుడు కుంగిపోలేదని హరీష్ రావు…
మధ్యప్రదేశ్‌లోని రేవాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న రైలులో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. ఈ ఘటనపై మహిళ ఏడుస్తూ వచ్చి జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిందితుడిపై మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తాను రైలులో వస్తువులు విక్రయిస్తానని, తాను రైలు ఎక్కినప్పుడు.. బోగీ మొత్తం ఖాళీగా ఉందని మహిళ తెలిపింది. దీన్ని అవకాశంగా తీసుకున్న నిందితుడు తలుపులన్నీ మూసి వెనుక నుంచి…
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)-ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. CSIR-ICIB లో 400 కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో మంచి అవకాశం. ఈ జాబ్ లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ csir.res.in నుండి ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు కోసం 12…
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తాం.. త్వరలో జమ్మూకశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. మరోవైపు.. ఆర్టికల్ 370పై అమిత్ షా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో విలీనం ఆలస్యం కావడానికి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కారణమని అన్నారు. 370 తాత్కాలిక పరిష్కారమని సుప్రీంకోర్టు అంగీకరించిందని తెలిపారు. జవహర్‌లాల్ నెహ్రూ పనిని ఇష్టపడేవారు.. అతని…
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ ఈరోజు ప్రకటించింది. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
క్రికెట్ లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్టాపింగ్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ. ఈ రూల్స్ ప్రకారం బౌలింగ్ జట్టు.. తన తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. అలా లేకపోతే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి…
జపాన్‌లోని హక్కైడో ప్రావిన్స్‌లోని హకోడేట్ తీరంలో శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో చేపలు కొట్టుకురావడం కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలను చూసి స్థానిక ప్రజలు ఖంగుతిన్నారు. కాగా.. ఆ చేపలను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. చనిపోయిన చేపలను ఇంటికి తీసుకురావద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చేపలు విషం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. కాగా.. చనిపోయిన ఈ చేపల వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు కనిపించడంతో…
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని సున్నితమైన పాయింట్లను మ్యాపింగ్ చేయడంతో పాటు.. డ్రోన్‌ల కదలికలు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాను తనిఖీ చేయడానికి ఏజెన్సీ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) సిద్ధం చేసినట్లు సరిహద్దు భద్రతా దళం (BSF) అధికారులు తెలిపారు. చండీగఢ్‌లో బీఎస్‌ఎఫ్ వెస్ట్రన్ కమాండ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్‌ల కదలికలను బీఎస్‌ఎఫ్ పర్యవేక్షిస్తోందని, గత ఏడాది కాలంలో 95 డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ.. వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ టోర్నీలో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో షమీ ద్వారా అనుకున్న ఫలితం రాకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చూపించడంతో టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ.. మహ్మద్ షమీకి అభిమానులలో ఆదరణ ఆకాశాన్ని అంటుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో.. మహ్మద్…