ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ ఈరోజు ప్రకటించింది. రాయ్‌పూర్‌లోని సైన్స్ కాలేజ్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఆయనతో పాటు.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
Read Also: Big Breaking: రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆదరణ పొందిన విష్ణు దేవ్ సాయి.. రాష్ట్రంలో పార్టీకి అత్యంత ముఖ్య నాయకుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌కు సన్నిహితుడు. కాగా.. గత నెలలో ఎన్నికలకు ముందు అమిత్ షా.. కుంకురిలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ సాయిని కీలక బాధ్యతలకు ఎంపిక చేయనున్నట్లు సూచించాడు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే విష్ణు దేవ్ సాయిని ‘పెద్ద మనిషి’గా తీర్చిదిద్దుతారని షా అన్నారు.
Read Also: ICC: క్రికెట్లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు
ఇదిలా ఉంటే.. 2020 నుండి 2022 వరకు విష్ణు దేవ్ సాయి.. ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగా నాలుగు సార్లు ఎంపీగా ఉన్నారు. పార్టీ కార్యకలపాల్లో చురుకుగా పాల్గొని.. మంచి ఇమేజ్‌ని దక్కించుకున్నారు. కాగా.. రాష్ట్రానికి చెందిన తొలి గిరిజన ముఖ్యమంత్రి సాయి అని బీజేపీ చెబుతోంది. ఆదివారం జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో విష్ణుదేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అయితే రమణ్ సింగ్ ముఖ్యమంత్రి పదవి ఆశించినప్పటికీ, సాయి వైపే బీజేపీ నేతలు మొగ్గు చూపడంతో ముఖ్యమంత్రి పదవి వరించింది.