ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఈరోజు (సోమవారం) U19 ప్రపంచ కప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 19 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇంతకుముందు.. ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించేందుకు నిర్ణయించగా.. ఇప్పుడు అక్కడి నుంచి వేదికను తరలించారు. ఈ టోర్నమెంట్ లో.. భారత్, బంగ్లాదేశ్, అమెరికా, వెస్టిండీస్, నమీబియా, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, నమీబియా, నేపాల్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, జింబాబ్వే, ఐర్లాండ్, ఆస్ట్రేలియాతో కలిపి 16 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 41 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఇండియన్ పీనల్ కోడ్ (IPC), ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సాక్ష్యాధారాల చట్టంలో మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త బిల్లులను ఆమోదించింది. వచ్చే వారం పార్లమెంట్‌లో మూడు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 11న హోంమంత్రి అమిత్ షా.. 163 ఏళ్ల నాటి మూడు ప్రాథమిక చట్టాలను సవరించే బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), ఎవిడెన్స్ యాక్ట్. కొత్త రూపంలో తీసుకురానున్న దేశద్రోహ చట్టానికి సంబంధించి…
మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ ఖరారయ్యారు. బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ను సీఎంగా ప్రకటించింది. మోహన్ యాదవ్ గతంలో మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో ఉజ్జయిని సౌత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
అమెరికాకు చెందిన F-16 యుద్ధ విమానం దక్షిణ కొరియాలో కూలిపోయింది. శిక్షణ సమయంలో విమానం ప్రమాదానికి గురైందని యోన్‌హాప్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోకి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని అధికారులు తెలిపారు. నివేదికల ప్రకారం.. గన్సన్‌లోని యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. “సియోల్‌కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న గున్సాన్‌లోని విమానాశ్రయం…
గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం సబబేనని తెలిపింది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నాయకులు స్పందించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. "ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో.. జమ్మూ కాశ్మీర్‌ను దేశంలోని ప్రధాన భావజాలంలో చేర్చే చారిత్రాత్మక పనిని ప్రభుత్వం…
'క్యాష్ ఫర్ క్వైరీ' కేసులో తనను పార్లమెంట్ సభ్యత్వం నుంచి బహిష్కరించడాన్ని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి బహుమతులు, అక్రమంగా లంచం తీసుకున్నట్లు ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను సభ ఆమోదించడంతో డిసెంబర్ 8న మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించారు. ఈ ఆరోపణలను టీఎంసీ నేత తీవ్రంగా ఖండించారు.
రైతుపై దాడి చేసి చంపిన పులిని చంపాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రాణాంతక చర్యలను ఆశ్రయించే ముందు పులి నరమాంస భక్షకమని అధికారులు నిర్ధారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా.. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ రద్దు అయింది. డర్బన్ లో ఎడతెరిపి లేని వర్షం పడుతుండటంతో.. టాస్ పడకుండానే మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేశారు. మొత్తం మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో మ్యాచ్ జరగాల్సి ఉంది. మిగతా రెండు టీ20లు ఈనెల 12, 14 తేదీల్లో జరగనున్నాయి. ఆ మ్యాచ్ లు సెయింట్ జార్జ్ పార్క్, న్యూ వాండరర్స్ స్టేడియాల్లో జరగనున్నాయి.
సచివాలయంలో తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు భాద్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో.. ఇప్పుడు అంతకు రెట్టింపు సంతోషం ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలి.. నీళ్లు నిధులు, నియామకంతో పాటు ఆత్మగౌరవం ముఖ్యమేనని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా.. నియంత పాలన, డిక్టేటర్ పాలన పోయింది.. రాష్ట్ర ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా రుణం తీర్చుకున్నారని తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాముడు కంటే గొప్పగా ప్రజాపాలన అందించే దేవుడు లేడు.. రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారికి రాముడే ఆదర్శం.. ప్రజలు కోరుకున్నది అందించే ఏకైక రాజు శ్రీరామచంద్రమూర్తి అని తెలిపారు. కాబట్టి రాముడిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాపాలన అందిస్తుందన్నారు. మతసామరస్యానికి సైతం…