తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్ కో రాత పరీక్ష వాయిదా వేస్తున్నట్లు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వచ్చింది. ఈ పరీక్ష ఈనెల 17న జరగాల్సి ఉంది.. అయితే అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు జెన్ కో తెలిపింది.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదని విమర్శించారు. మరోవైపు.. కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీస్ అమలు చేయరు అని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలని తెలిపారు. కొందరు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని మాట్లాడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. ఏమైందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు. ప్రభుత్వం కూలిపోతోంది అని కామెంట్స్ చేసిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. వ్యాఖ్యలు చేసిన వారిలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నారు.
ఎల్.బి నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు తొందర పడి మాట్లాడొద్దని సూచించారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకొద్ధామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దామని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని హుందాగా స్వీకరిద్ధామని సుధీర్ రెడ్డి తెలిపారు.
సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ను చూసేందుకు లోపలికి అనుమతించాలని నిరసనకు దిగారు. వారంతా.. సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. అంతేకాకుండా.. ఆస్పత్రి ముందు లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో.. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా అస్సలు వినడం లేదు. మరోవైపు.. ఆస్పత్రి వద్ద ఇతర పేషంట్స్ కి ఇబ్బంది కలుగుతుందని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కానీ.. వినకుండా ఆస్పత్రి మెయిన్ గేట్ వద్ద…
సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో మాజీ సీఎం కేసీఆర్ను మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పరామర్శించారు. అనంతరం ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండ్రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని మంత్రులు పేర్కొన్నారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడివరకు సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు కేసీఆర్.
హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.
హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని, వారి అర్జీలను తీసుకున్నామని తెలిపారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశం పంపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
వచ్చే ఏడాది 2024 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. 2024 సంవత్సరంలో సాధారణ సెలవులు 27, ఐచ్ఛిక సెలవులు 25 ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలాఉంటే.. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సర్కార్ సెలవును ప్రకటించింది. దీనికి బదులు ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటించింది. నెగోషియబుల్ ఇన్‌ట్రుమెంటల్ చట్టం కింద 23 సాధారణ సెలవులను రాష్ట్ర…