రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం ఈనెల 18 నుంచి రాష్ట్రపతి హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 23 వరకు అంటే ఐదు రోజుల పాటు.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమే బస చేయనున్నారు. అనంతరం తిరిగి 23వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి పై మేడ్చల్ జిల్లా శామీర్ పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు, అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా.. మల్లారెడ్డి అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. శామీర్ పేట మండలంలోని కేశవాపురం గ్రామంలో 47 ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో.. తహశీల్దార్…
మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబెల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. నిజం గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగివచ్చినట్టు అయ్యిందని విమర్శించారు. కేసీఆర్ కి పనితనం తప్ప పగతనం తెలియదని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన ప్రభుత్వం వచ్చాక.. కేసులు పెడితే సగం…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్ ను కేటాయించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి ప్రజా భవన్ కి షిఫ్ట్ అవ్వనున్నారు. కాగా.. నిన్న రాత్రి ప్రజా భవన్ భట్టి విక్రమార్క పరిశీలించారు. రేపు ఉదయం 8.20కి ఆర్ధిక మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత.. ప్రజా భవన్ లో అధికారిక నివాస భవనంలో ఉండనున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచారు సీఎం రేవంత్. కాగా.. ధరణి పై సమీక్ష చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ధరణి రద్దు చేస్తాం అని రేవంత్ ప్రకటించారు. ఈ నేపధ్యంలో ధరణి రద్దు..? సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
గృహా నిర్మాణ శాఖ కార్యకలాపాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి గృహ నిర్మాణశాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, స్పెషల్ సెక్రటరీ & గృహ నిర్మాణ సంస్థ ఎండీ విజయేంద్ర బోయి, గృహ నిర్మాణ సంస్థ, గృహ నిర్మాణ మండలి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా.. ఏవిధమైన ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో జరిగిన పేపర్ లీకేజీలు, ఇతర ఇబ్బందులను ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా ఉండే విధంగా సాఫీగా పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు.
ఉద్యోగ నియామకాలు, ఉద్యోగ ప్రవేశ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమీషన్ల పనితీరును అధ్యయనం చేసి సవివరమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించి మంగళవారం సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సి.ఎం. కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవీ గుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, టీ.ఎస్.పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శి…
ఇండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. కాగా.. ఆతిథ్య దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అయితే డిసెంబర్ 10న జరగాల్సిన మొదటి టీ20 వర్షం కారణంగా టాస్ లేకుండానే రద్దయింది. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్ ను జట్టులోకి తీసుకోలేదు. అంతేకాకుండా..…
సోమవారం సాయంత్రం టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామా చేయగా.. తాజాగా టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు ఆర్. సత్యనారాయణ రాజీనామా చేశారు. కాగా.. చైర్మన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించలేదన్న విషయం తెలిసిందే. అయితే.. పేపర్ లీకేజీ, తదితర వ్యవహారాలపై పూర్తి బాధ్యులను గుర్తించే వరకూ రాజీనామాలను ఆమోదించకపోవచ్చని ఊహాగానాలూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తన రాజీనామాకు సంబంధించి సత్యనారాయణ ఓ లేఖ రాశారు.