ఇటీవల జరిగిన ప్రపంచకప్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ.. వికెట్లు తీసి ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఆ టోర్నీలో మహ్మద్ షమీ అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు. కానీ.. ఫైనల్ మ్యాచ్ లో షమీ ద్వారా అనుకున్న ఫలితం రాకపోవడంతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా పేలవ ప్రదర్శన చూపించడంతో టీమిండియా ఓడిపోయింది. ఏదేమైనప్పటికీ.. మహ్మద్ షమీకి అభిమానులలో ఆదరణ ఆకాశాన్ని అంటుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో.. మహ్మద్ షమీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నాడు. అందులో మహ్మద్ షమీ ఫామ్ హౌస్ కనిపిస్తుంది.. అక్కడికి మహ్మద్ షమీని కలిసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.
NTR : ‘దేవర’ షూటింగ్ పూర్తి అయ్యేది అప్పుడేనా..?
షమీని కలుసుకునేందుకు వేలాది మంది అభిమానులు తమ బైక్‌లు, కార్లపై ఫామ్‌హౌస్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో.. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో భద్రతా ఏర్పాట్లను పెంచారు. కాగా.. మహ్మద్ షమీ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతే కాకుండా.. సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేసి తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Deputy CM: కేసీఆర్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఈ వీడియోను మహ్మద్ షమీ 18 గంటల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా.. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. అంతేకాకుండా.. వినియోగదారులు కామెంట్లలో మహమ్మద్ షమీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా.. 4-1తో ఆస్ట్రేలియాను ఓడించింది. ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో టీమిండియా 3 టీ20ల సిరీస్ తర్వాత వన్డే, టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది.