తెలంగాణలో పలు కార్పొరేషన్ ఛైర్మన్‌ల నియామకాలను ప్రభుత్వం రద్దు చేసింది. అందుకు సంబంధించి ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 54 మంది నియామకాలు, పదవీ కాలం పొడిగింపును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. కాగా.. డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగా, అప్పటి నుంచి గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ సలహాదారుల నియమకాలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా 54 కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాలు రద్దు చేసింది.
దుబాయ్ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియాకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యువ జట్టు పాకిస్థాన్‌తో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం పాక్ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బ్యాటింగ్ లో ఆజాన్ అవైస్ సెంచరీ (105)తో నాటౌట్ గా నిలిచాడు. ఆ తర్వాత సాద్ బేగ్ (68) పరుగులతో…
హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇటీవల మరణించిన జనగామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం అరూరి రమేష్ మాట్లాడుతూ.. 2013లో నియోజకవర్గ బాధ్యతలు తీసుకున్నప్పటినుండి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులకు,…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ ఎన్నికల…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల జేఏసీ కలిశారు. ఈ సందర్భంగా.. వీఆర్వో వ్యవస్థ రద్దయినప్పటి నుండి ఇప్పటి వరకు అన్యాక్రాంతమై, కబ్జాలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలన్నీ ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అనాలోచిత విధానంతో.. గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు అనేక ఇబ్బందులను గురిచేసిందని వారు పేర్కొన్నారు. దరిద్రమైన ధరణి వెబ్ సైట్ ద్వారా ఖరీదైన భూముల వివరాలన్నీ అన్యక్రాంతం చేశారని జేఏసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నియోజకవర్గం మునుగోడులో బెల్ట్ షాపులు ఉండవని తేల్చి చెప్పారు. అంతేకాకుండా.. బెల్ట్ షాపుల వ్యవహారంలో ఎవరి మాట విననని అన్నారు. పదవి పోయినా బెల్ట్ షాపులను తెరవనివ్వనని కరాఖండిగా చెప్పారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇది నియోజకవర్గ ప్రజల ప్రతి ఒక్కరి నిర్ణయమని అన్నారు.
ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుటకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయుటపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం MCR HRDIT ని సందర్శించి, ఫాకల్టీతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సంస్థ కార్యకలాపాలు గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను తెలుసుకున్నారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను సోలార్ పవర్ వాహనంలో పర్యటించి పరిశీలించారు. సీఎంతో పాటు.. మంత్రి సీతక్క పాల్గొన్నారు.
గూగుల్ మ్యాప్ ను నమ్ముకున్న ఓ డీసీఎం వ్యాన్ డ్రైవర్.. నిర్దేశిత స్థలానికి కాకుండా ఓ ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. అక్కన్నపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టు నీటిలోకి డీసీఎం వ్యాన్ వెళ్లింది. దీంతో.. విషయం తెలుసుకున్న జాలు బాయి తండావాసులు భారీగా తరలివచ్చారు. అనంతరం జేసీబీ సహాయంతో డీసీఎం వ్యానును బయటకు తీశారు.
నిజామాబాద్ జిల్లాలో ఆర్టీసి కండక్టర్ నిర్వాకం బయటపడింది. నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో ఓ కండక్టర్ మహిళలకు టికెట్ కొట్టాడు. ఉచిత బస్సు సౌకర్యం ఉందన్న కండక్టర్ వినలేదు. ఈ క్రమంలో.. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు బాధితులు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. వెంటనే.. కండక్టర్ ను విధుల నుంచి ఆర్.ఎం. జాని రెడ్డి తప్పించారు. బోధన్ డిపోలో కండక్టర్ గా పని చేస్తున్న నర్సింహులుగా గుర్తించారు.