క్రికెట్ లో రేపటి నుంచి కొత్త రూల్ అమలు కానుంది. స్టాపింగ్ క్లాక్ పేరుతో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది ఐసీసీ. ఈ రూల్స్ ప్రకారం బౌలింగ్ జట్టు.. తన తర్వాతి ఓవర్ లోని మొదటి బంతిని మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకండ్ల లోపే వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. అలా లేకపోతే రెండుసార్లు వార్నింగ్ ఇస్తారు. మూడోసారి కూడా అలానే జరిగితే.. బౌలింగ్ జట్టుకి 5 పరుగుల పెనాల్టీ వేస్తారు.
Read Also: Japan Fish: జపాన్‌లోని బీచ్‌లో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు.. చూసి షాక్కు గురవుతున్న జనాలు
కాగా.. వికెట్ కోల్పోయినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాటర్ వచ్చినప్పుడు ఈ రూల్ వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు. 41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ కొత్త రూల్ ను అమలు చేసి పరిశీలిస్తారు. ఆట వేగాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ చెప్తుంది. రేపు వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య జరిగే టీ20 మ్యాచ్ నుంచే ప్రయోగాత్మకంగా అమలు కానుంది.
Read Also: CPI Narayana: ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించడం ప్రమాదకర చర్య..