Conference: ఈనెల 21న కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి కాన్ఫరెన్స్. ఈ కాన్ఫరెన్స్ కు కలెక్టర్లంతా సిద్ధంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. భూ రికార్డులతో ముడిపడిన సమస్యలతో పాటు.. కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా.. కొత్త రేషన్ కార్డుల జారీ, మహాలక్ష్మి వంటి పథకాల అమలుపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.