ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు 14 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పురపాలక సంఘాల్లోని పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ సిబ్బంది తమ డిమాండ్ల సాధన కోసం రెండు వారాలుగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ.. సఫలం కాలేదు. దీంతో సమ్మె కొనసాగిస్తామని మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. ఈరోజు హిందూపురంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న శిబిరానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వెళ్లారు. మున్సిపల్ కార్మికుల సమ్మెలో పాల్గొని.. వారికి మద్దతు తెలిపారు. తమను పోలీసులు…
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో పనికిరాని మంత్రి.. రాజమండ్రి రూరల్లో పోటీకి పనికొస్తాడా అంటూ ఆరోపించారు. రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థిగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీపై మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తాను పోటీ చేయటం ఖాయమని, అధిష్టానం ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా పోటీ చేస్తానని బుచ్చయ్య చౌదరి తెలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్ అని టీడీపీ అధిష్టానం ఎప్పుడో ప్రకటించింది.. ఇప్పుడు ఉండదని చెప్పడానికి జనసేన నాయకుడు ఎవరు? అంటూ…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. సీఎం జగన్ ట్విట్టర్ లో విషెస్ తెలిపారని అన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుంటి విరిగింది కాబట్టి.. జగన్ పరామర్శించారని, రేవంత్ కు తుంటి విరగలేదు కదా అని కామెంట్ చేశారు.
కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుంది. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం పర్యటించనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా.. వారికి విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. అనంతరం.. సీఈఓ ఎంకే మీనాతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రేపటి సమావేశం అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఈసీ బృందం మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం…
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం…
డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. నిర్లక్ష్యంగా వాహనం నడపటంతో చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి బస్సు కింద పడి మృతి చెందింది. బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో వాడపల్లి శ్రీవల్లి (5) అనే చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. చిన్నారి అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన కాగా.. అత్తిలి జేమ్స్ స్కూల్లో LKG చదువుతుంది.
రేపు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చంద్రబాబు ' రా కదలిరా' సభ నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు ముందే నేతల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. ఈ సభకు.. ఏవి సుబ్బారెడ్డి రాకూడదని అల్టిమేటం జారీ చేశారు. ఆయన వస్తే రచ్చ రచ్చే అని అంటున్నారు. తాను సైలెంట్ గా ఉన్నా, అనుచరులు ఊరుకోరని భూమా అఖిల ప్రియ అంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి ముందు చెప్పింది అఖిల ప్రియ.
గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పై వైసీపీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేసింది పార్టీ అధిష్టానం. వారిని అనర్హులను చేయాలని అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఆఫీసుల్లో వైసీపీ ఫిర్యాదు చేసింది. అనర్హుల్లో ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ఉన్నాయి. ఎమ్మెల్సీలలో వంశీకృష్ణ, సి.రామచంద్రయ్య ఉన్నారు.
కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ - గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు. ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు.
మంత్రి ఆర్కే రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ అబద్దాలకోరు పార్టీ అని మండిపడ్డారు. ఈరోజు వడమాలపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రోజా.. అనంతరం వ్యాఖ్యలు చేశారు. గుంపులు గుంపులుగా వచ్చే పార్టీని హైదరాబాద్ కు తరిమి కొట్టండని విమర్శించారు. వాళ్లు అందరూ కూడా నాన్ లోకల్ పొలిటిషియన్స్ అని తెలిపారు. చంద్రబాబుకి, పవన్ కల్యాణ్, లోకేష్ కి ఆంధ్ర ప్రదేశ్ లో సొంత ఇల్లు గానీ, ఓటు గాని లేదని మంత్రి రోజా…