Avinash vs Rammohan: కేశినేని నాని ఎపిసోడులో దేవినేని అవినాష్ – గద్దె రామ్మోహన్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. కేశినేనిని చంద్రబాబు అవమానించారని అవినాష్ అన్నారు. అంతేకాకుండా.. క్యాష్ కొట్టు.. సీటు పట్టు అనే విధానం టీడీపీలో ఉందంటూ అవినాష్ సెటైర్లు వేశారు.
Read Also: Minister Roja: టీడీపీ అబద్దాలకోరు పార్టీ.. మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
ఈ క్రమంలో.. అవినాష్ కు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కౌంటర్ ఇచ్చారు. మా పార్టీ వ్యవహారాలు అవినాష్ కు ఎందుకు..? అని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ అంతా అసంతృప్త వాదులతో నిండిపోయిందని విమర్శించారు. వైసీపీకి తాడేపల్లి ప్యాలెస్సుకో దండం పెట్టి ఎమ్మెల్యేలే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ అధినేతలుగా చంద్రబాబుకు, జగన్ కు ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. చంద్రబాబు మీద విమర్శలు చేసే స్థాయి అవినాష్ ది కాదని రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ ముఖానే పడుతుందని విమర్శించారు. ఐదేళ్లల్లో అసలు సీఎం జగన్నే కలవలేదన్న ఎమ్మెల్యేల గురించి అవినాష్ ఏం చెబుతారు..?అని ప్రశ్నించారు. మీ బాధలు మీరు పడండి.. మా బాధలు మేం పడతామని గద్దె రామ్మోహన్ అన్నారు.
Read Also: Haryana: ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధాని, సీఎంకి 500 మంది విద్యార్థినుల లేఖ