ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ -2 అభ్యర్థులకు ఊరట అందించే వార్త ఒకటి చెప్పింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును మరో వారం రోజులు పొడిగించింది. ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు తెలిపారు. గ్రూప్- 2 పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో.. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నిర్వహణ అధ్వానంగా ఉందని అభ్యర్థులు తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు రోజుల తరబడి ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని అభ్యర్థులు…
ఏపీ కాంగ్రెస్ కొత్త ఊపందుకుంది. ఏపీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ మార్పులు కనిపిస్తోంది. అందుకు తోడు.. షర్మిల కూడ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీలో జోష్ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొందరు పార్టీలో చేరారు. సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, బీఆర్ఎస్ నేతలు, జె.డి.లక్ష్మీనారాయణ అనుచరులు, వైసీపీ, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరారు.
మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సామాన్యుడిలా రైల్వే ప్లాట్ ఫాం మీద కూర్చున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరం రైలులో ప్రయాణించుటకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారు. గతంలో కేంద్ర విమానయానశాఖ మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు రాజకుటుంబానికి చెందినవారు. అయితే సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన ఆయన.. ఒక సామాన్య ప్రయాణికుడిలా రైల్వే స్టేషన్‌లో కనిపించారు. ఆయన కావాలనుకుంటే అధికారులే వచ్చి వీఐపీ…
కొంతమందిలో పడుకున్నప్పుడు గురక అనేది వస్తుంది. దాని వల్ల వారు బాగానే పడుకున్నా.. ఎదుటి వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతారు. గురక అనేది శ్వాసలో ఇబ్బంది వల్ల వస్తుంది. అంతేకాకుండా.. ఎక్కువ బరువున్న వాళ్లు, చెడు జీవనశైలి, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వాళ్లకు గురక వస్తుంది. అయితే గురక సమస్యతో పోరాడుతున్నట్లయితే.. ఈ సింపుల్ హోం రెమెడీస్ వల్ల ఆ సమస్య నుండి బయటపడచ్చు.
అదానీ గ్రూప్ తయారు చేసిన దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ మానవరహిత వైమానిక వాహనం (UAV)ని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ బుధవారం హైదరాబాద్ లోని అదానీ ఏరోస్పేస్‌లో ఆవిష్కరించారు. ఈ డ్రోన్లు భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా తయారు చేశారు. అంతేకాకుండా.. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దృష్టి డ్రోన్లను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని హరి కుమార్ వివరించారు. దృష్టి 10 ‘స్టార్‌లైనర్’ అనేది ఒక అధునాతన ఇంటెలిజెన్స్, సర్వైలెన్స్, రికనైసెన్స్ (ISR) ప్లాట్‌ఫారమ్.…
ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పొంగులేటి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతుబంధుపై అపోహలు వద్దని.. పండుగ అయిపోగానే రైతులందరికీ రైతుబంధు అందుతుందని తుమ్మల తెలిపారు. ఎంత అహంకారం ఉన్నా.. ప్రజల ముందు దిగదుడుపే అని తెలంగాణ ప్రజలు నిరూపించారన్నారు. తెలంగాణలో కబ్జాల రాజ్యం పోవాలని ప్రజలు కోరుకున్నారని.. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి నారాయణ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేతల మధ్య పోరు చాలా రోజులుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నారాయణపై అనిల్ విరుచుకుపడ్డారు. నెల్లూరు నగరంలో ఏ బిల్డర్ లేదా, వ్యాపారినైనా గుండెమీద చేయి వేసుకొని చెప్పమనండి.. అనిల్ నుంచి ఫోన్ వచ్చిందని. వ్యాపారస్తులను ఏనాడు తాను ఇబ్బంది పెట్టలేదని అనిల్ చెప్పారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో రెడ్ బుక్ అంశంలో నారా లోకేశ్ పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. లోకేశ్ తన ప్రసంగాల్లో రెడ్ బుక్ అంశం ప్రస్తావనకు తెస్తుండడం పట్ల.. సీఐడీ గత నెలలో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీఐడీ తెలిపింది. ఈ క్రమంలో.. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై డిసెంబరు 28న విచారణ జరగగా.. జనవరి…
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడం లేదని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ చేయాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 12 మంది దళిత శాసన సభ్యుల్ని ట్రాన్స్ ఫర్ చేయడం అవివేకమన్నారు.…
శింగనమల ఎమ్మెల్యే పద్మావతి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించింది పద్మావతి తెలిపారు. హైకమాండ్ ఆదేశాలతో పద్మావతి మీడియాకు వివరణ ఇచ్చారు. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ అవ్వడంతో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.