నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'రా కదలిరా' బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సభలో భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో రాక్షసులు భయపడేలా పాలన ఉందని ఆరోపించారు. హిట్లర్ కూడా ఈ పాలన చూసి భయపడతారని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పని లేదని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో గూండాల్ని తయారు చేశారని మండిపడ్డారు. గుండాలను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నారని అఖిలప్రియా దుయ్యబట్టారు.
కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరులో "నిజం గెలవాలి" యాత్రలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెనొప్పితో చనిపోయిన గోనేభావి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, అతని చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం.. అతని కుటుంబానికి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారని.. ప్రతి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని నారా…
టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'రా కదలిరా' సభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు, జనాలు రావడంతో.. చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జనాన్ని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు పివి నరసింహారావును పార్లమెంట్ కి పంపితే ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. పివి నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ జనవరి 9న అధికారం చేపడితే, ఇదే రోజు…
బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు…
కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయి. కాగా.. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. మరోవైపు.. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది.
ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్ కొలిక్కిరాలేదు. మరోసారి సారథితో రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ చర్చలు జరిపారు. 30 నిమిషాలు పాటు వారు చర్చించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు అయోధ్య రామిరెడ్డి. కాగా.. నిన్న సీఎం జగన్తో ఎమ్మెల్యే పార్థసారథి సమావేశమైన విషయం తెలిసిందే. అయినా సారథిలో అసంతృప్తి తగ్గనట్లుగా కనిపిస్తోంది. అయితే.. వచ్చే ప్రభుత్వం కేబినెట్ బెర్త్ పై హామీ కోసం సారథి పట్టుబడుతున్నట్లు సమాచారం. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని అయోధ్య రామిరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకు…
టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఇవాళ లేదా రేపు.. స్పీకర్ ను కలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ ఫిర్యాదు చేయనుంది. కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిపై టీడీపీ అనర్హత పిటిషన్ ఇవ్వనుంది. ఆ నలుగురిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ స్పీకర్ ను కోరనుంది. అనర్హత పిటిషనుకు బలం చేకూర్చేలా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనుంది టీడీపీ.