కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకుంది. ఏపీలో మూడు రోజుల పాటు సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బృందం పర్యటించనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా.. వారికి విమానాశ్రయంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, బెజవాడ సీపీ స్వాగతం పలికారు. అనంతరం.. సీఈఓ ఎంకే మీనాతో సీఈసీ రాజీవ్ కుమార్ భేటీ అయ్యారు. రేపటి సమావేశం అజెండా అంశాలపై సమీక్ష నిర్వహించారు. సీఈసీ బృందం మూడ్రోజుల పర్యటనలో భాగంగా.. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం రేపు (జనవరి 9) సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సీఈసీ బృందం ఎల్లుండి (జనవరి 10) భేటీ కానుంది.
Sajjala Ramakrishna Reddy: జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదు..
మూడు రోజుల పర్యటనలో ఏపీలో అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయనున్నారు ఈసీ అధికారులు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఈసీ బృందం సమీక్ష జరపనుంది. ఇదిలా ఉంటే..10 తేదీన ఎన్నికల సన్నద్ధతపై ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
Rana Daggubati :మన సంస్కృతికి, మన మనసులకు చాలా దగ్గరగా ఉండేలా “హనుమాన్” చిత్రం రూపొందింది..
మరోవైపు.. రేపు కేంద్ర ఎన్నికల సంఘంతో వైసీపీ నేతలు సమావేశం కానున్నారు. వైసీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్ హాజరుకానున్నారు. టీడీపీ ఓటర్ల నమోదులో అవకతవకలకు పాల్పడుతోందని వైసీపీ ఫిర్యాదు చేయనుంది. మొన్న తెలంగాణలో ఓట్లు వేసిన ఏపీ ఓటర్లు.. రేపు మళ్ళీ ఏపీలో ఓట్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయనుంది. ఆధారాలతో సహా వైసీపీ ప్రతినిధి బృందం ఫిర్యాదు చేయనుంది. అటు.. టీడీపీ, జనసేన అధినేతలు ఈసీ అధికారులను కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు. ఎన్నికల ఏర్పాట్లపై లోపాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో లోపాలు, జాబితా తయారీలో వాలంటీర్ల జోక్యం వంటి విషయాలపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరనున్నారు.