ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్మికులు, అంగన్ వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారు ప్రభుత్వంతో కలిసి పలుమార్లు చర్చించినప్పటికీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీలతో అనేక దఫాలుగా చర్చలు జరిపాం.. అయినా సమ్మె కొనసాగిస్తున్నారన్నారు. అందుకే ఎస్మా పెట్టామని తెలిపారు. కొంతమంది అంగన్వాడీ వర్కర్లు నాయకులు ఆడియో మెసేజ్ లు బయటకు వచ్చాయి.. వీటిలో రాజకీయ అజెండా కనిపించిందని సజ్జల తెలిపారు. వాళ్ళు రాజకీయం చేస్తున్నారని తాను అనటం లేదన్నారు. చేయగలిగినంతా ప్రభుత్వం చేసింది.. భవిష్యత్తులో మరింత చేస్తాం అని కూడా చెప్పామని పేర్కొన్నారు. వాళ్ళ డిమాండ్ లో నిజాయితీ ఉన్నట్లే.. తమ హామీలోనూ నిజాయితీ ఉందని చెప్పారు.
India-Maldives row: మాల్దీవులతో వ్యాపారం మానుకోండి.. వ్యాపార సంఘం CAIT పిలుపు..
బాలింతలు, పసి పిల్లలు, గర్భిణీలకు ఆహారం అందించటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీల పట్ల ఏ రకంగా వ్యవహరించిందో అందరం చూశామన్నారు. జీతాల పెంపు ఒక్కటే చేయలేం అని చెప్పాం.. వీరి వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. జైలుకు కూడా వెళ్తాం అంటున్నారు.. ఇటువంటి బెదిరింపు ధోరణి వల్ల సమస్య మరింత జటిలం అవుతుందని చెప్పారు. రాజకీయ అజెండాకు బలి కావద్దు అని కోరుతున్నట్లు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు కూడా ఇదే చెబుతున్నాం.. ప్రజా సేవలు అందించటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. మీరంతా కూడా ప్రభుత్వంలో భాగం.. జీతాల పెంపు ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు.
Nandyala: రేపు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. నేతల మధ్య భగ్గుమన్న విబేధాలు..
రౌండ్ టేబుల్ పేరుతో చేసిన సమావేశంలో టీడీపీ వాళ్ళే ఉన్నారని సజ్జల తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుంది.. ఆ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఇదేదో హెచ్చరిక కాదు.. ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాల్సిన బాధ్యత ఉంటుందని సజ్జల పేర్కొన్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. వాళ్ళు ఎందుకు ఎన్నికల విధుల్లో ఉంటారు? అని ప్రశ్నించారు. ఆరోపణలకు అర్థం పర్థం లేదని విమర్శించారు. ఇదిలా ఉంటే.. టీడీపీకి ఈసారి 23 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు. ఓటమి కారణాలు చెప్పుకోవటానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.. బరితెగించి బండగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు తెలిసిన విద్య ఇది ఒకటేనని సజ్జల ఆరోపించారు.