మూడు రాజధానులు అని ఏ ఒక్క రాజధాని లేకుండా చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ధనిక సీఎం జగన్.. పెద్దవాళ్ళకు, పెత్తందార్లకు యుద్ధం అంటున్నాడు అని అన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట సభలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా.. టీడీపీ-జనసేన జైత్ర యాత్ర ఉమ్మడి పశ్చిమగోదావరి నుంచి కొనసాగుతుందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగున్నర ఏళ్లలో సమాజంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని మండిపడ్డారు. మరోవైపు.. పెట్రోల్, కరెంట్ ధరలు పెంచారు.. ఎక్కడ చూసినా బాదుడే బాదుడు అని విమర్శించారు.
తాము ఉద్యోగస్తులకు వ్యతిరేకం కాదని అన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్వాడీ అయినా.. మున్సిపల్ కార్మికుడు అయినా ఉపాధ్యాయుడు అయినా అందరూ ఒక్కటేనని తెలిపారు. ఐదో తేదీ నుండి గర్భిణీలకు, బాలింతలకు వైయస్సార్ కిట్లును ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. అంగన్వాడీలు 11 సమస్యలు తమ ముందు ఉంచారని.. అందులో 10 సమస్యలకు ఒప్పుకున్నామని తెలిపారు. మిగతా ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం కాదని చెప్పామన్నారు. నాలుగు నెలలు తర్వాత…
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జనాభాలో 70శాతం బీసీలు ఉన్నారని తెలిపారు. ఇక్కడ చైతన్యం కొరవడిందని గుర్తించి బీసీలను కదిలించి న్యాయం చేసేందుకు బీజేపీ ముందుకు వచ్చిందని అన్నారు. ఏపీలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను బానిసలుగా, నోరు లేని జీవులుగా…
విశాఖలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బీసీ సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సత్యకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. బీసీ కమిషన్ కు ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నిస్తోందని తెలిపారు. నా బీసీ కులాలు అనే నైతికత జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నామన్నారు. బీసీల సంక్షేమానికి అంకితమైన వారిని గుర్తించాలని…
చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు బ్రోకర్ రాజకీయాలు చేసి ఎదిగారని విమర్శించారు. రా..కదలి రా.. అంటే రావడం లేదు. ఆంబోతులంటూ తమపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని మంత్రి అంబటి అన్నారు. చంద్రబాబు స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు.. తాను అలాగే మాట్లాడగలనని తెలిపారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమని పేర్కొన్నారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక ప్రకటన చేశాడు. త్వరలో దుబాయ్ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఆడనున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. అయితే, ఈ టోర్నీలో పాల్గొనే ప్రొఫెషనల్ ఆటగాళ్లకు ఎలాంటి రాజకీయ సంబంధాలు ఉండకూడదన్న నిబంధన ఉందని వివరణ ఇచ్చాడు. ఈ నెల 20 నుంచి మొదలయ్యే ఐఎల్ టీ20లో ముంబై ఎమిరేట్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలిపాడు. గతంలోనూ ఐసీఎల్ లోనూ ముంబై ఇండియన్స్ తరుఫున ఆడాడు.
ఏపీలో రేపటి నుంచి మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటించనుంది. ఈ క్రమంలో.. రేపు ఎన్నికల అధికారుల బృందం విజయవాడ చేరుకోనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. ఈ నెల 9వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో భేటీ కానున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాపట్ల జిల్లా అద్దంకిలో పొలిటికల్ సీన్ మారుతుంది. నియోజకవర్గంలో మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. పాత కొత్త ఇంఛార్జ్ లను సమన్వయం చేయకపోవడంతో అద్దంకి వైసీపీ వ్యవహారాలు ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుగా మారిపోతున్నాయి. కొత్త ఇంఛార్జ్ వైసీపీ నేతలను కలిసేందుకు ఊరురా తిరుగుతూ ఉంటే.. పాత ఇంఛార్జ్ ఆ ఊరి నేతలతో కలిసి మీటింగ్ పెట్టి సమాలోచనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంఛార్జ్ మార్పు వైసీపీకి కలిసొస్తుందా..? కొండ నాలుకకు…