Rajesh Veeramalla
Author- NTV Telugu-
Peddireddy: రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళ.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని కిరికెరలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఒక అద్దాల మేడ.. రాయి వేస్తే పగులుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణ అయినా.. ఆయన అల్లుడు అయినా.. ఆయన వియ్యంకుడు చంద్రబాబు అయినా ఓడిపోవాల్సిందేనని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ వర్సెస్… -
Gudivada Amarnath: మంత్రి గుడివాడ సీటుపై అధిష్టానం క్లారిటీ.. అక్కడి నుంచి పోటీ..!
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తులు చేస్తుండగా.. పార్టీ గెలవలేని చోట గెలిచే అభ్యర్థిని ఖరారు చేస్తుంది అధిష్టానం. ఈ క్రమంలో.. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడో తెలిపింది. అతని సీటుపై వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈసారి పెందుర్తి నుంచి అమర్నాథ్ పోటీ చేయనున్నారు. పెందుర్తిలో కాపు, వెలమ ఓట్లు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది హై కమాండ్. -
YSRCP: ముగిసిన నర్సరావుపేట పంచాయతీ..
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో నర్సరావుపేట పంచాయతీ ముగిసింది. రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సర్దుబాటు కసరత్తు చేశారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఆయన వ్యతిరేక వర్గం వాదనలు విన్న విజయసాయిరెడ్డి.. ఇరువర్గాల మధ్య సర్దుబాటు చేశారాయన. అంతేకాకుండా.. పార్టీ విజయం కోసం పనిచేయాలని విజయసాయి రెడ్డి వారికి సూచించారు. -
Round Table Meeting: సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం..
విజయవాడలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్మా వద్దు.. జీతాలు పెంచండి అనే అంశంపై మీటింగ్ లో చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. 28 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 18వేలు అంగన్వాడీలకు ఇస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో దాన్ని అమలు చెయ్యడం లేదని అన్నారు. కనీస వేతనాలు కార్మికులకు ఇవ్వాలి.. కార్మికులకు అండగా ఉంటామన్నారు. మరోవైపు..… -
YCP: కొనసాగుతున్న వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తు..
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జుల మార్పు కసరత్తుపై చర్చలు కొనసాగుతున్నాయి. సీఎంవో పిలుపుతో పలువురు నేతలు తాడేపల్లికి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో.. నందికొట్కూరు నియోజకవర్గ ఇంఛార్జి మార్పుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జి బైరెడ్డి సిద్దార్థ రెడ్డికి సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఇంఛార్జి మార్పుపై కసరత్తు చేస్తుంది అధిష్టానం. మరోవైపు.. సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను బైరెడ్డి కలిశారు. నందికొట్కూరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ అభ్యర్థిత్వాన్ని బైరెడ్డి… -
Ambedkar Konaseema: కలెక్టరేట్ ఎదుట మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది మహిళ. ఆ మహిళను ఆత్రేయపురం మండలం వద్దిపర్రుకు చెందిన కొండేపూడి జ్యోతిగా గుర్తించారు. అయితే.. ఆ మహిళ ఆత్మహత్యహత్నం కారణం.. ఉప్పే బాపిరాజు అనే వ్యక్తి తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. -
Pattabhiram: ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదు..
ఏపీలో అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఏపీలో సమ్మె చేయని కార్మిక వర్గం లేదని ఆరోపించారు. అంగన్ వాడీలు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్షా అభియాన్ సిబ్బంది, 108-104 అంబులెన్సుల ఉద్యోగులు సమ్మెలోనే ఉన్నారని తెలిపారు. వారి డిమాండ్ల మొత్తం విలువ జగన్ రెడ్డి తన విలాసాల కోసం తగలేసినంత ఉండొచ్చని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీ అమలు కోసం పోరాడుతున్న వారిపై లాఠీలు ఝళిపించి, ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా?… -
Minister Karumuri: మా ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు..
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో టీడీపీ అధినేత చంద్రబాబు 'రా కదలిరా' కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ఎమ్మెల్యేలుపై తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్యేలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఈ నేపధ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. తన పుట్టినరోజుకు వచ్చిన జనం కూడా.. నిన్న ఆచంటలో జరిగిన చంద్రబాబు నాయుడు సభకు రాలేదని… -
Krishna District: కూతురు వెంట పడుతున్నాడని యువకుడిపై కత్తులతో దాడి..
తన కూతురు పడొద్దని ఆ యువకుడికి ఆ తండ్రి ఎన్నిసార్లు చెప్పాడో.. చివరకు ఆవేశం ఆగక కడతేర్చాలని చూశాడు. పద్ధతి గల కుటుంబం కావున తన కూతురు వెంట ఓ యువకుడు పడుతున్నాడని నలుగురికి తెలిస్తే పరువు పోతుందనుకున్న తండ్రి.. చివరకు చంపేందుకు సిద్ధమయ్యాడు. సినిమాటిక్ టైప్ లో తన కొడుకుతో కలిసి తన కూతురు వెంటపడుతున్న యువకుడిపై దాడి చేశారు. -
Chandrababu: జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుంది..
మూడు రాజధానులు అని ఏ ఒక్క రాజధాని లేకుండా చేశారని జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐదేళ్లు రాజధాని లేకుండా పాలన చేయడం జగన్ విశ్వసనీయత అని విమర్శించారు. మరోవైపు.. జగనన్న వదిలిన బాణం ఏమయ్యింది.. తిరిగి జగన్ వైపు దూసుకు వస్తుందని వ్యంగ్యం ప్రదర్శించారు. వైఎస్ మృతికి కారణం అని రిలయెన్స్ పై దాడులు చేశారు.. రిలయెన్స్ వాళ్ళు వస్తే రాజ్యసభ ఇచ్చి పంపించారని చంద్రబాబు ఆరోపించారు. దేశంలో ధనిక సీఎం జగన్.. పెద్దవాళ్ళకు, పెత్తందార్లకు యుద్ధం అంటున్నాడు అని అన్నారు.…
తాజావార్తలు
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్‌తో రాబోతున్నాడా?
-
Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
-
Shreyas Iyer: అప్పుడు చాలా బాధేసింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఇప్పుడు ఫుల్ హ్యాపీ!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
ట్రెండింగ్
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!