Nandigama Suresh: అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, ఎమ్మెల్యే శంకరనారాయణ, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్ కళ్యాణ్ కు భాగస్వామ్యం కల్పించిన దుర్మార్గుడు చంద్రబాబు అని ఎంపీ విమర్శించారు.
Read Also: CEC: సీఈసీ వద్దకు రాజకీయ పార్టీలు క్యూ.. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు
చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చరమగీతం పాడుతామని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే, ఏపీలో టీడీపీ వస్తుందన్నట్లు చంద్రబాబు హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రెండు ఎకరాల నుంచి ఆరు లక్షల కోట్ల రూపాయలకు చంద్రబాబు అక్రమ సంపాదన అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. నియోజకవర్గ ఇంఛార్జ్ మార్పు కసరత్తుపై మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండే నాయకులకే సీఎం జగన్ టిక్కెట్లు ఇస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. సమన్వయకర్తల నియామకంలో కులాలను అంటగట్టొద్దని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ పెద్దపీట వేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రత్యర్థి అని.. ఆ పార్టీలో ఎవరున్నా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు.
Read Also: Ashika Ranganath: జూనియర్ అనుష్క అనిపించుకోవడం హ్యాపీనే.. నా సామిరంగ భామ ఆషిక రంగనాధ్ ఇంటర్వ్యూ
ఎమ్మెల్యే శంకరనారాయణ మాట్లాడుతూ.. బలహీన వర్గాలను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, పేదలకు కార్పొరేట్ విద్య అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని తెలిపారు. సీఎం జగన్ సామాజిక న్యాయం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తలెత్తుకుని తిరుగుతున్నాయని పేర్కొొన్నారు. కాగా.. కుట్రలకు మారుపేరు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. జగన్ పాలనలో జరిగిన సామాజిక న్యాయంపై బహిరంగ చర్చకు సిద్ధం అని అన్నారు. దమ్మూ, ధైర్యం ఉంటే చంద్రబాబు చర్చకు సిద్ధమా..? అని ఎమ్మెల్యే శంకరనారాయణ సవాల్ విసిరారు.