Jonnalagadda Padmavathi: తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
Read Also: YCP: కొలిక్కిరాని ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్..
కాగా.. ఈ వ్యవహారంపై సజ్జల రామకృష్ణారెడ్డి సహా సీఎం జగన్ ను కలవనున్నారు ఎమ్మెల్యే పద్మావతి. తనకు సింగనమల సీటు నిరాకరించడంతో ఎమ్మెల్యే పద్మావతి సీఎంవో పై విమర్శలు చేసింది. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలు చేసింది. తమ కాలువల నుంచి తాము తాగునీటి విడుదల కోసం.. సీఎంవో నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. తన వ్యాఖ్యల పై సీఎంకు వివరణ ఇవ్వనున్నారు పద్మావతి.
Read Also: Lakshadweep: లక్షద్వీప్ మినికాయ్ దీవుల్లో కొత్త విమానాశ్రయం!