కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయి. కాగా.. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. మరోవైపు.. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది.
Read Also: Merugu Nagarjuna: ప్రభుత్వం కృషిని జస్టిస్ బాల కిషన్ కమిటీ అభినందించింది..
అంతేకాకుండా.. టీడీపీ ఎలక్ట్రోరల్ కమిటీలోని కోనేరు సురేష్ సహా ఇతర సభ్యులపై వైసీపీ ఫిర్యాదు చేసింది. మరోవైపు.. హైదరాబాద్ లో నివాసం ఉండే వారి ఓట్లను ఏపీలో నమోదు చేయించడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదిలాఉంటే.. 10.32 లక్షల అప్లికేషన్లు పరిశీలించకుండానే డ్రాఫ్ట్ ఎలక్షన్ రోల్స్ ప్రకటించడంపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరి వ్యక్తుల పేర్లతో భారీ ఎత్తున ఫాం-7 ధరఖాస్తులు దాఖలు కావడాన్ని టీడీపీ సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది.
Read Also: Rashmika Mandanna : అయ్యో.. ఎంత పని చేశావ్ రష్మిక.. క్షణాల్లో తప్పించుకున్నావ్..
నిబంధనలకు విరుద్దంగా ఫాం-7 ధరఖాస్తులు చేసిన వారిని గుర్తించినా.. చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఆరోపించింది. అంతేకాకుండా.. ఇంటింటి సర్వేను గ్రామ సచివాలయ సిబ్బంది చేపట్టడాన్ని టీడీపీ తప్పు పట్టింది. రూల్స్ కు విరుద్దంగా వాలంటీర్ల జోక్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని సీఈసీ కోరింది టీడీపీ – జనసేన. అంతేకాకుండా.. గతంలో తామిచ్చిన రిప్రజెంటేషన్లకు చర్యలు తీసుకోకుండా సీఈఓ మొక్కుబడి వివరణలు ఇస్తున్నారని సీఈసీకి టీడీపీ కంప్లైంట్ చేసింది.